AP: శాంతిని అందుకే సస్పెండ్ చేశాం.. మంత్రి ఆనం సెన్సేషనల్ కామెంట్స్..! దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి ఆమెను సస్పెండ్ చేశామన్నారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఆమె అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. విశాఖలో విజయసారెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్, శాంతి పాత్ర ఉందని సమాచారం అందిందన్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Minister Anam Ramanaraya Reddy: దేవదాయా శాఖలో సహాయ కమిషనర్ గా ఉన్న శాంతిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి సస్పెండ్ చేశామన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సస్పెన్షన్ జరిగేది కాదేమోనని అన్నారు. ఆమెకు రాజకీయ నేతలతో పలు సంబంధాలు ఉన్నాయని.. విధి నిర్వహణలో పలు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. Also Read: ఎంపీడీఓ మిస్సింగ్ పై డిప్యూటీ సీఎం సీరియస్.. అసలు కారణం ఇదే అంటున్న MPDO తనయుడు..! విజయవాడలో విల్లా కొనుక్కోవాలని కమిషనర్ కు అనుమతి కోసం దరఖాస్తు చేసిందన్నారు. అందుకు కమిషనర్ అనుమతి ఇవ్వలేదని.. అపార్ట్మెంట్ కొనుగోలుకు అనుమతించారని తెలిపారు. విశాఖపట్నంలో విజయసారెడ్డి చేసిన రెవెన్యూ దందాలో న్యాయవాది సుభాష్ ..శాంతి పాత్ర ఉందని తమకు సమాచారం అందిందన్నారు. Also Read: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. మిథున్‌రెడ్డిపై రాళ్ల దాడి.! ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా అక్రమంగా కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటిపై కూడా విచారణ చేస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ భూములను 99 సంవత్సరాల లీజుకు కూడా ఇచ్చారని.. నివేదికలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనుమతితో తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. #anam-ramanarayana-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి