/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/7-13-jpg.webp)
Minister Ambati Rambabu: ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈఓ సహా ఐదుగురిని ఈ పిటిషన్‌లో చేర్చారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది.
రీపోలింగ్ కి నో ఛాన్స్..
ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎం ధ్వంసం కావడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు సీఈఓ మీనా. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని స్పష్టం చేశారు.