Ambati: చంద్రబాబు భార్య భువనేశ్వరి, నారా లోకేష్ లపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, వ్యవస్థలను మానేజ్ చేసీ ఇక్కడి వరకు వచ్చారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్ట్ తో నిజం గెలుస్తుందని..ఇక హైకోర్ట్ లో నిజం గెలిచిందని..తప్పకుండా సుప్రీంకోర్ట్ లోనూ నిజం గెలుస్తుందన్నారు మంత్రి అంబటి. ఈ క్రమంలోనే.. 17ఎ గురించి ఎందుకు అంత పట్టుబడుతున్నారని టీడీపీ పై మంత్రి అంబటి నిప్పులు చెరిగారు. చంద్రబాబును అరెస్ట్ నుండి తప్పించాలని అంతమంది లాయర్స్ ప్రయత్నస్తున్నా ఎందుకు నిజం గెలవడం లేదని ప్రశ్నించారు?. చంద్రబాబు అరెస్ట్ తో 100 మంది చనిపోయారు అంటున్నారని..అయితే, నిజంగా చంద్రబాబు కోసం చనిపోయే అంత సీన్ ఉందా? అని చురకలు వేశారు.
చంద్రబాబు అరస్ట్ తో చాలా మంది ఆత్మలు శాంతిస్తున్నయన్నారు మంత్రి అంబటి. ఎన్టీఆర్ దగ్గర నుండి రంగా వరకు ఎంతోమంది ఆత్మలు శాంతిస్తున్నాయని వ్యాఖ్యనించారు. చంద్రబాబు అరెస్ట్ తో చనిపోయిన వారి కుటుంబాలను మొదట్లో బాలకృష్ణ పరామర్శిస్థానని చెప్పాడని..అయితే, ఇప్పుడు భువనేశ్వరి పరామర్శకు వెళ్తా అంటుందని..కాగా, చంద్రబాబుతో మూలాఖత్ తర్వాతే ఈ నిర్ణయాలు మారాయని వెల్లడించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. బాలకృష్ణను ఎందుకు రానిస్తాడని ఆరోపించారు మంత్రి అంబటి.
Also read: అధినేత ఏ నిర్ణయం తీసుకున్న ఆయన వెంటే మేము!
అసలు టీడీపీ భవిష్యత్ కే గ్యారెంటీ లేదు..ఇంకా భవిష్యత్తు గ్యారెంటీ సభలు ఎందుకని మంత్రి అంబటి ఎద్దేవ చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని చంద్రబాబు సింపతీ డైలాగ్స్ చెబుతున్నారని అన్నారు. అయితే, సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని..సీంపతీ రాజకీయాలు వర్క్ ఔట్ అయ్యే రోజులు కాదని మంత్రి అంబటి వ్యాఖ్యనించారు. చంద్రబాబు భద్రతకు ఎలాంటి డోకా లేదని అన్నారు. స్కిల్ కేసు చాలా పెద్ద కేసని..చంద్రబాబు స్కామ్ చేశాడని అన్ని ఆధారాలు ఉన్నాయని ధీమ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అన్ ఫిట్ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీ తోనే ఉన్నానని చెబుతున్నాడు..ఇక్కడ టీడీపీతో పొత్తు లో ఉన్నా అంటున్నాడు..అయితే, అక్కడ టీడీపీతో పొత్తు పై , ఏపీలో తెలంగాణ బీజేపీతో పొత్తుపై పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. టీడీపీ, జనసేనతో కలవడం వల్ల ఒరిగేది ఏమి లేదని దుయ్యబట్టారు.