పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. మంత్రి అమర్నాథ్ చురకలు

పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్. తెలంగాణలో ఫలితాలు చూసి పవన్ కు మతి భ్రమించినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం పెట్టుకున్నారని అన్నారు.

New Update
పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క బెటర్.. మంత్రి అమర్నాథ్ చురకలు
Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై (Pawan Kalyan) సెటైర్లు వేశారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్‌ కళ్యాణ్‌కు తెలంగాణలో వచ్చిన ఫలితమే ఏపీలో కూడా వస్తుందని అన్నారు. అందుకు నిన్న సభ మరోసారి రుజువు చేసిందని పేర్కొన్నారు. విశాఖ (Vishakapatnam) అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే మీరు రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
నిన్న విశాఖ వేదికగా పవన్ విమర్శలు చేశారని అన్నారు. వ్యక్తి గతంగా సీఎం జగన్‌పై (CM Jagan) అవాస్తవ విమర్శలు చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఫలితాలు చూశాక పవన్‌కు మతి భ్రమించినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో చూస్తే బర్రెలక్క (Barrelakka) స్థాయిలో పవన్ సేన పోటీ పడిందని విమర్శించారు. బర్రెలక్కను తక్కువ చేయడం లేదు.. ఆమె స్థాయి కూడా పవన్ సేన పోటీ ఇవ్వలేదని స్పష్టత ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ మీకు ఏపీకి సంబంధం ఏంటి?, మీరు ఏపీలో ఎంతకాలం వున్నారు?, పవన్ మీ నియోజకవర్గం ఏంటో చెప్పగలరా? అని పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. ఎక్కడకు వెళ్తే అక్కడ మా నియోజక వర్గం అంటారు అబ్రహం లింకన్‌కు మీకు సంబంధమేంటి?.. మీది చంద్రబాబు (Chandra Babu) లింకన్ సంబంధం అని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ది ది పొలిటికల్‌ కాంట్రాక్ట్‌ అని చురకలు అంటించారు. అధికారికంగా బీజేపీతో అనధికారికంగా టీడీపీతో పవన్ సంబంధం పెట్టుకున్నారని అన్నారు.

ALSO READ: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Advertisment
తాజా కథనాలు