సీఎం జగన్‌ను విమర్శిస్తూ మాజీ మంత్రి, కాపు సీనియర్ నేత హరిరామ జోగయ్య రాసిన లేఖపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. వయసు పెరిగినకొద్దీ జోగయ్యకు పవన్ సాంగత్యం వల్ల అశ్లీలత పెరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బహిరంగ లేఖ రాశారు. అందుకే ఇలాంటి చెత్త ఉత్తరాలు రాస్తున్నారని విమర్శించారు. అడ్డమైన వాగుడు వాగి సోషల్ మీడియాతో పాటు టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాకు మేత అందిస్తున్నావన్నారు.
బాబు దత్తపుత్రుడు పవన్‌పై దృతరాస్టుడి ప్రేమ ఉంటే లాభం ఏమిటి..? అని ప్రశ్నించారు. పవన్ పుట్టిందే బాబు కోసం..పవన్ నిర్మాతలంతా బాబు మనుషులే అని ఆయన లేఖలో వెల్లడించారు. మీపై మాకు శత్రుత్వం లేదు.. కానీ మీ దిగజారుడుతనం మీ పద్ధతిని సూచిస్తుందన్నారు. మీ పద్ధతి ఎలా ఉందో మీ పిల్లలను అడిగి తెలుసుకోవాలన్నారు. మీ దిగజారుడుతనం పగవాడికి కూడా వద్దన్నారు. మీ పద్ధతి బాగుందో లేదో కనీసం మీ శ్రేయోభిలాషులను కనుక్కుని విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ లేఖను ముగించారు.