Mimicry Row: ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్..

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ను ఇమిటేట్ చేయడాన్ని సమర్థించుకున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ. లోక్‌సభలో ప్రధాని మోదీ సైతం అనేక సార్లు ఇలా చేశారని గుర్తు చేశారు. తాను ఎవరినీ కించపరచాలని చేయలేదన్నారు. మిమిక్రీ ఒక కళగా అభివర్ణించారు.

Mimicry Row: ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్..
New Update

Mimicry Row: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను విపక్ష ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఇమిటేట్ చేయడం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రధానంగా ఇవాళ ఇదే అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. అధికారపక్షం సభ్యులు ఈ చర్యలు తీవ్రంగా ఖండించారు. అయితే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 'మిమిక్రీ ఒక కళ' అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌పై తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ. 'నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యం నాకు లేదు. మిమిక్రీ ఒక కళ. ధన్‌కర్‌పై చాలా గౌరవం ఉంది.' అని కల్యాణ్ బెనర్జీ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ నుంచి 150 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన దరిమిలా.. సభ్యులందరూ పార్లమెంట్ ఎదుట మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరిగిందని వివరించారు ఎంపీ కల్యాణ్ బెనర్జీ. ఆ సందర్భంగా.. ధన్‌ఖర్‌ను అనుసరించానని, ఇందులో ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను మిమిక్రీ మాత్రమే చేశానని, అది ఒక కళగా అభివర్ణించారు కల్యాణ్.

ఇదే సమయంలో తనను తప్పుపడుతున్న వారికి మరో ప్రశ్న సంధించారు ఎంపీ కల్యాణ్. గతంలో లోక్‌సభలోనే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఎన్నోసార్లు ఇతరులను అనుకరించి అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. దానిపై ఎందుకు సభ్యులు స్పందించలేదని ప్రశ్నించారు కల్యాణ్ బెనర్జీ. ప్రధాని మోదీ ఇతరులను హేళన చేసిన వీడియోలు ఉన్నాయని, వాటిని కూడా తాము ప్రదర్శిస్తామని అన్నారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు అధికార పక్ష సభ్యులు. ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్ సంఘీభావంగా ఎంపీలంతా రాజ్యసభలో ఒక గంటపాటు నిలబడి, ఆయనపట్ల గౌరవం చూపారు. కాగా, ఈ ఘటన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్‌కు ఫోన్ చేశారు. సంఘీభావం తెలిపారు. తాను కూడా 20 ఏళ్లుగా ఇలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీలు తమ వ్యక్తీకరణ గౌరవ ప్రదంగా ఉండేలా చూసుకోవాలని హితవు చెప్పారు. లోక్‌సభ స్పీకర్ కూడా ఈ చర్యను ఖండించారు.



Also Read:

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్..

సీట్ల పంపకాలపై టీడీపీ-జనసేన ఫోకస్.. కాకినాడ పార్లమెంట్ ఆయనకేనా?!

#mimicry-row #jagdeep-dhankhar #trinamool-mp #mp-kalyan-benerjee
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe