Sweet: పాలు-కొబ్బరి స్వీట్ కేవలం 4 రూపాయాలే.. నిమిషాల్లో బాక్స్‌ మొత్తం ఖాళీ!

గోరఖ్‌పూర్‌లోని పాలు, కొబ్బరితో చేసిన ఓ స్వీట్ సంచలనం సృష్టించింది. దీని ధర రూ.4. ఇది ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. తినడానికి రుచికరంగా ఉండే ఈ స్వీట్ జనాన్ని పిచ్చెక్కిస్తోంది. ఈ స్వీట్‌గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి.

New Update
Sweet: పాలు-కొబ్బరి స్వీట్ కేవలం 4 రూపాయాలే.. నిమిషాల్లో బాక్స్‌ మొత్తం ఖాళీ!

Sweet: పాలు, కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసిందే. ఆ రెండు కలిపి కొందరూ స్వీట్‌గా చేసుకుని తింటారు. అయితే.. ఇప్పుడు పాలు, కొబ్బరితో చేసిన స్వీట్ సంచలనం సృష్టించింది. ధర కేవలం 4 రూపాయలు మాత్రమే, ట్రే మొత్తం నిమిషాల్లో అయిపోతుందట. ఈ స్వీట్లను రుచి చూడటానికి కస్టమర్లు అన్ని వైపుల నుంచి దుకాణాన్ని చుట్టుముట్టారట. ఎవరైనా ఒకటి రెండు ముక్కలు స్వీట్లు కొంటున్నారు. దీనిని రుచి గొప్పగా ఉండటం వలన మొత్తం ట్రేని తీసుకుంటున్నారు. ఇది అంతా ఎక్కుడో కాదు గోరఖ్‌పూర్‌లో జరిగింది. ప్రజలను ఆకర్షించే అనేక ఆహార పదార్థాలు అక్కడ లభిస్తున్నాయి. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రజలు ఆ రుచిని రుచి కచ్చితంగా చూస్తారు. ఆ నగరంలో 24 రకాల దిల్‌ఖుష్ స్వీట్లు అందుబాటులో ఉన్నాయి. రూపానికి ఎంతో ప్రత్యేకంగా, తినడానికి రుచికరంగా ఉండే ఈ స్వీట్ జనాన్ని పిచ్చెక్కిస్తోంది. ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారట.

పాలు,కొబ్బరితో చేసిన ఈ స్వీట్

గోరఖ్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఈ స్వీట్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ రుచిలో గొప్పగా ఉంది. దీన్ని సిద్ధం చేయడానికి వారికి చక్కెర, కొబ్బరి, పిండి కలిపి ఈ ప్రత్యేకమైన స్వీట్‌ను సిద్ధం చేస్తారు. ఒకటి రెండు కాదు దాదాపు 24 రకాల స్వీట్లు పాలు, కొబ్బదిలో తయారు చేస్తున్నారు. దిని రుచి చూడటానికి నలువైపుల నుంచి దుకాణం చుట్టుముడుతున్నారు. అయితే.. ఈ స్వీట్లను రుచి చూసిన వారు నచ్చితే ఒకటి రెండు రకాల స్వీట్లు కొంటారు. కానీ దీని రుచి బిన్నంగా ఉంటవలన అక్కడికి వెళ్లిన ప్రతిఒక్కరు ట్రే మొత్తం కొని తీసుకెళ్తున్నారట. ఈ స్వీట్లు సింగిల్ పీస్‌లో 4 రూపాయలకు దొరుకుతాయని, డజన్ కొంటే మొత్తం ట్రే ఖరీదు 60 రూపాయలు అని చెబుతున్నారు.

స్వీట్‌లో 24 రకాలు 

ఈ స్వీట్ చిన్నదిగా చాలా చౌకగా కనిపిస్తుంది. కానీ తిన్న తర్వాత, ప్రజలు దీనిని అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఈ స్వీట్‌లో 24 రకాలు తయారు చేస్తారు. ఇందులో జామ, అరటి, మామిడి, మొక్కజొన్న, లిచీ, స్ట్రాబెర్రీ, యాపిల్, పుచ్చకాయ ఆకారంలో తాయరు చేసి ఉన్నాయి. దుకాణం దగ్గర నిల్చున్న కస్టమర్ స్వీట్లు చిన్నవిగా ఉన్నా తినడానికి చాలా రుచిగా ఉంటాయని అంటున్నారట. ఇక్కడి ప్రజలు కేవలం 1 లేదా 2 ముక్కలను మాత్రమే కాకుండా మొత్తం ట్రేని కొనుగోలు చేస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 1200 నుంచి 1500 ముక్కలు అమ్ముడవుతున్నాయని తాయరీ దారులు చెబుతున్నారు

ఇది కూడా చదవండి: డ్రై ఫ్రూట్స్‌ లడ్డూ ఎప్పుడైనా తిన్నారా..? దాని రుచే వేరబ్బా..!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

Advertisment
తాజా కథనాలు