BOEING MAX: బోయింగ్ ఎక్కితే పైకి గోయింగేనా? మ్యాక్స్ 9 విమానాలపై ఎందుకీ భయం?

అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత బోయింగ్‌ విమానాలంటేనే జనం జంకుతున్నారు. పలు దేశాల్లో మ్యాక్స్ 9 ఫ్లయిట్స్‌ కార్యకలాపాలను ఇప్పటికే నిలిపివేశారు.

BOEING MAX: బోయింగ్ ఎక్కితే పైకి గోయింగేనా? మ్యాక్స్ 9 విమానాలపై ఎందుకీ భయం?
New Update

ఆకాశంలో విమానం వెళ్తుంటే, కిందనుంచి చూడటానికి బాగుంటుంది. ఎప్పుడు ఎక్కుదామా అని తెగ సరదాగా ఉంటుంది. కానీ టేకాఫ్, ల్యాండింగ్ టైమ్‌లో ఎవరికైనా కాస్త ఒళ్లు జలదరించాల్సిందే. అలాంటిది ఫ్లయిట్ గాల్లో ఉండగానే... దాని డోర్ ఊడిపోతే ఎలా ఉంటుంది..? ఊహించుకోడానికే వణుకుపుట్టే సన్నివేశం అది. అలాంటి సీన్ అలస్కా ఎయిర్‌లైన్స్‌లో ఇటీవల వెళ్లిన ప్రయాణికులకు ఎదురైంది. బోయింగ్ 737 మ్యాక్స్(Boeing 737 MAX) విమానం టేకాఫ్ తీసుకున్నాక, 16వేల అడుగుల ఎత్తుకి చేరాక, ఒక్కసారిగా ఎడమవైపున్న డోర్ ఊడిపోయింది. ఆ సమయంలో ఫ్లయిట్‌లో 171 మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లంతా ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నారు. అయితే విమానాన్ని వెంటనే వెనక్కి తిప్పి ల్యాండింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పటికీ ఆగిపోయిన కార్యకలాపాలు:
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలంటేనే జనం భయపడుతున్నారు. పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు బోయింగ్ 737 విమానాల్ని, ముఖ్యంగా మ్యాక్స్ 9 ఫ్లయిట్స్‌ కార్యకలాపాలు ఆపేశాయి. తాజాగా జపాన్‌లోని ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌కి చెందిన బోయింగ్ విమానం కాక్‌పిట్ అద్దంలో పగుళ్లు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా కిందకి దించారు. అయితే ఇది మ్యాక్స్‌ 9 సిరీస్‌కి చెందిన విమానం కాదు.

మొత్తం ప్రక్రియపై విచారణ:
అసలు మ్యాక్స్‌ 9 విమానాల్లోనే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలస్కా ఎయిర్‌లైన్స్ ఘటనలో 220 మంది ప్రయాణించేందుకు వీలుగా, నిబంధనల ప్రకారం అత్యవసర మార్గాలు ఏర్పాటు చేశారు. లేఅవుట్‌కు ఈజీగా ఉండటానికి ప్లగ్‌ను అత్యవసరం మార్గంలాగా ఉంచారు. అదే ఇక్కడ ఊడిపోయింది. అయితే కేవలం ఇక్కడ ప్లగ్‌ మాత్రమే ఊడిపోలేదు, బోల్ట్‌లు కూడా ఊడి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవతున్నాయి. మొత్తం 737 మ్యాక్స్ 9 విమానాల ప్రక్రియపైనే ఇప్పుడు విచారణ జరుగుతోంది.

మన సంగతేంటి?
2018, 2019లో రెండు బోయింగ్ మ్యాక్స్ సిరీస్ విమానాలు కూలిన దుర్ఘటనలు ఇంకా అందరికీ గుర్తున్నాయి. ఇండోనేషియాలో ఒకటి, ఇథియోపియాలో మరో విమానం కూలి వందలమంది ప్రాణాలు పోయాయి. అందుకే తాజా ఘటన దెబ్బకి చాలా దేశాలు మ్యాక్స్ 9 విమానాల్ని నిలిపేశాయి. చైనాలో మ్యాక్స్ 9 విమానాలు లేకపోయినా, అసలు మ్యాక్స్‌ సిరీస్ విమానాలన్నింటినీ పక్కనబెట్టారు. మనదేశంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ దగ్గర బోయింగ్ మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. అయితే అలస్కా ఘటనతో అన్ని విమానయాన సంస్థల దగ్గర మ్యాక్స్ 9 విమానాలను తనిఖీ చేశారు. ప్రస్తుతానికైతే వీటిల ఏ ఇబ్బందులు లేవని చెబుతున్నారు.

నియంత్రణా లోపాల వల్లే:
నిజానికి గతంలో బోయింగ్ విమానాలు ప్రమాదాలకు గురైన సందర్భంలో పెద్దగా చర్చలు తీసుకున్న దాఖలాలు లేవు. 2018, 2019 దుర్ఘటనల తర్వాత అప్పటి సీఈఓని తొలగించి మమ అనిపించారు. అప్పటి డొనాల్డ్ ట్రంప్ సర్కార్ బోయింగ్ కంపెనీపై 2.5 బిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. కానీ సాఫ్ట్‌వేర్ మార్పుల్ని ఎఫ్‌ఏఏకు చెప్పకుండా ఉన్నందుకు ఎలాంటి క్రిమినల్ చర్యలూ చేపట్టలేదు. ఇలాంటి నియంత్రణా లోపాల వల్లే విమానాల్లో ప్రమాదాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: కరోనా లాంటి మరో వైరస్‌.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు..

WATCH:

#boeing-737-max
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి