Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌ .. ఇక నుంచి ఆ సౌలభ్యం ఉండదు!

మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ ఊహించని షాక్‌ ఇచ్చింది. రాత్రి వేళలో, తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించిన రాయితీను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.రాత్రి , ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని  ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

New Update
Telangana: ఎల్బీనగర్ - హయత్‌నగర్ మార్గంలో 6 మెట్రో స్టేషన్లు..!

Metro: మెట్రో (Metro) ప్రయాణికులకు మెట్రో సంస్థ ఊహించని షాక్‌ ఇచ్చింది. రాత్రి వేళలో, తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించిన రాయితీను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. వేసవి కాలం కావడంతో బయట ప్రయాణాలు చేసే వారు మెట్రో రైలులో ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో దీంతో మెట్రో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదాయం పెంచుకునే దిశగా హైదరాబాద్ మెట్రో సంస్థ రాయితీలను ఎత్తేసినట్లు సమాచారం..

ఎండలు (Summer) మండిపోతున్న సంగతి తెలిసిందే. బస్సుల్లో, బైకు ల మీద ప్రయాణం చేసేవారికి ఎండ దెబ్బ తగులుతుంది.. దీంతో ఇతర రోడ్డు ట్రాన్స్పోర్ట్ లలో ప్రయాణించే పరిస్థితి లేదు. ఎండ కారణంగా చాలామంది మెట్రో ట్రైన్ లో ప్రయాణించడానికి వస్తున్నారు. ప్రయాణికులు అధికంగా వస్తున్న తరునంలో మెట్రో సంస్థ ప్రయాణికులకు ఇప్పుడు షాక్ ఇస్తూ టికెట్ పై ఉన్న రాయితీని తీసేసింది.

విషయం తెలిసిన మెట్రో ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి , ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని  ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైల్లో రెగ్యులర్ గా ప్రయాణించే వారి కోసం అధికారులు రూ. 59 హాలిడే కార్డును తీసుకు వచ్చారు. ఆ కార్డును ఉపయోగించి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చేసే మెట్రో ప్రయాణాలలో టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇచ్చేవారు.

ప్రస్తుతం ఎండలు విపరీతంగా పెరగడంతో బస్సు సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో నగరవాసులు మెట్రో ప్రయాణానికి ఎక్కువగా వస్తున్నారు. ఈ రద్దీని క్యాష్ గా చేసుకోవడానికి మెట్రో అధికారులు ఈ హాలిడే కార్డు రద్దు చేసినట్లు సమాచారం. రాయితీని మరల పునరుద్ధరించాలని మెట్రో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: జర జాగ్రత్త అవి ఓఆర్‌ఎస్‌ లు కాదు… ప్యాక్‌ చేసిన డ్రింక్‌ లే!

Advertisment
తాజా కథనాలు