Mental Health: నిద్ర లేదా ఆహారపు అలవాట్లు మారాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!

సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం, నిద్ర లేదా ఆహారపు అలవాట్లను పదేపదే మార్చుకోవడం మానసిక సమస్యలను పెంచుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, ప్రియమైన వ్యక్తి మరణం లేదా విడాకులు లాంటి ఒత్తిడితో కూడిన జీవిత పరిస్థితులకు మెంటల్‌ హెల్త్‌ లేకుండా చేస్తాయి. ఇటివలి కాలంలో యువకుల్లో మానసిక సమస్యలు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.

Mental Health: నిద్ర లేదా ఆహారపు అలవాట్లు మారాయా? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే!
New Update

Mental Health: అన్నిటికంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం.. శారీరక ఆరోగ్యం సరిగ్గా లేకున్నా కొన్ని రోజులకు అంతా సెట్ అవుతుంది. కానీ మానసిక సమస్యలు జీవితకాలం ఉంటాయి.. వాటిని స్టార్టింగ్‌లోనే ఎండ్‌ చేయడానికి ట్రై చేయాలి.. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువకులకు మెంటల్‌ హెల్త్ ప్రాబ్లెమ్స్‌ ఎక్కువగా ఉంటున్నాయి. సైకాలజిస్టుల ప్రకారం "యుక్తవయస్సులో ఉన్న మానసిక ఆరోగ్య రుగ్మతలలో దాదాపు సగం వరకు 14 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతాయి, అయితే చాలా సందర్భాలలో వాటిని గుర్తించరు, చికిత్స చేయరు".

మానసిక ఆరోగ్య సమస్యాలకు ప్రమాద కారణాలేంటి?

జన్యుపరంగా: కొంతమంది యువకులు వారి కుటుంబానికి చెందిన మానసిక అనారోగ్య చరిత్ర కారణంగా ఇతరుల కంటే మానసిక రుగ్మతలకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

బ్రెయిన్ కెమిస్ట్రీ: న్యూరోట్రాన్స్మిటర్లు సహజంగా సంభవించే మెదడు రసాయనాలు.. ఇవి మీ మెదడు, శరీరంలోని ఇతర భాగాలకు సంకేతాలను అందిస్తాయి. ఈ రసాయనాలతో కూడిన న్యూరల్ నెట్‌వర్క్‌లు బలహీనమైనప్పుడు, నరాల గ్రాహకాలు, నరాల వ్యవస్థల పనితీరు మారి, నిరాశ.. ఇతర భావోద్వేగ రుగ్మతలకు దారితీస్తుంది.

జీవిత అనుభవాలు: జీవితానుభవాలు కూడా ప్రభావితం చేస్తాయి.

➼ ఆర్థిక సమస్యలు, ప్రియమైన వ్యక్తి మరణం లేదా విడాకులు లాంటి ఒత్తిడితో కూడిన జీవిత పరిస్థితులు.

➼ మధుమేహం లాంటి దీర్ఘకాలిక వైద్య పరిస్థితి.

➼ తలపై బలమైన దెబ్బ, తీవ్రమైన గాయం కారణంగా మెదడు దెబ్బతింటుంది.

➼ ప్రకృతి వైపరీత్యాలు, వివక్ష, బెదిరింపు లాంటి బాధాకరమైన అనుభవాలు

➼ మద్యం, పొగాకు లేదా మాదకద్రవ్యాల అధిక వినియోగం

➼ భావాలను పంచుకోవడానికి తక్కువ సంఖ్యలో స్నేహితులు ఉండడం

➼ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం

➼ నిద్ర లేదా ఆహారపు అలవాట్లను పదేపదే మార్చుకోవడం

స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టండి:
మానిసక సమస్యలను స్టార్టింగ్‌లోనే ఎండ్‌ చేయడానికి మెడికల్‌ ప్రొఫెషనల్‌ని కలవడం ఉత్తమం. నిపుణుల సంరక్షణ అందుబాటులో లేని వారికి, ఒత్తిడిని తగ్గించడం, నిద్రను పెంచడం, సరైన పోషకాహారం లాంటి వాటిపై దృష్టి సారించడం వల్ల మన మానసిక ఆరోగ్యం మరింత దిగజారకుండా కాపాడుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. చికిత్స తీసుకోకపోతే, మానసిక అనారోగ్యం కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. కుటుంబ కలహాలు, నిరుద్యోగం, వ్యసనం, స్వీయ-హాని లాంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

ALSO READ: సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలేంటి? తప్పక తెలుసుకోవాలి..!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe