Mental Health Tips: ఈ మధ్య కాలంలో మానసిక సమస్యల్లో ఒత్తిడి, ఆందోళన సహజంగా మారాయి. ఫ్యామిలీ, పిల్లలు, కెరీర్ ఇలా ఎదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే.. అది ఒత్తిడి, ఆందోళనకు దారి తీస్తాయి. ఇవి మానసిక ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ సమస్యలను దూరం చేయడానికి ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వాలి. దీని వల్ల ఆలోచనలకు కాస్త దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడానికి ఈ టిప్స్ పాటించండి
సరైన నిద్ర
సరైన నిద్ర లేకపోవడం కూడా ఒత్తిడికి ప్రధాన కారణం. మానసిక , శారీరక ఆరోగ్యం పై విపరీతమైన ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేనప్పుడు మెదడు సరిగ్గా పని చేయకపోవడం, నీరసం, మానసిక ఒత్తిడి కలుగుతాయి. అందుకే రోజు 8-9 గంటల సేపు తప్పనిసరిగా నిద్ర ఉండేలా చూసుకోవాలి.
మనసుకు ప్రశాంతతను కలిగించే పనులు చేయండి
ఒత్తిడి, ఆందోళనగా ఉన్నప్పుడు ఏదైనా మనసుకు ప్రశాంతతను కలిగించే పనులను ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి . అలా చేస్తే నెగటివ్ ఆలోచనలను దూరం చేయడానికి సహాయపడును. యోగ, పిల్లతో ఆడుకోవడం, మెడిటేషన్, బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి.
స్నేహితులతో మాట్లాడడం
మానసిక ఒత్తిడి, ఆందోళన సమస్యలు ఒంటరిగా ఉంటే అవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. స్నేహితులు, ఆఫీస్ ఫ్రెండ్స్, బాగా నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. మనసుకు నచ్చిన వారితో సమస్యలను షేర్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఆలోచనలో కలిగే మార్పు.. మీ ఒత్తిడిని తగ్గించును.
ఇతరుల సలహాలు, సహాయం తీసుకోండి
కొంత మంది వారి సమస్యకు పరిష్కారం ఆలోచించలేక తమలో తామే.. తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అలా కాకుండా మీ సమస్యను నిపుణులు లేదా స్నేహితులతో షేర్ చేయండి దాని వల్ల మీకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.
ఒత్తిడితో పరిస్థితిని పాడు చేయవద్దు
ఏదైనా ప్రత్యేక కారణం చేత ఒత్తిడి కలిగినప్పుడు.. ముందుగా టెన్షన్ పడకుండా ప్రశాంతగా సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. మీ మానసిక సమస్య కుటుంబానికి సంబంధించినదైతే.. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెస్సన్ లో పాల్గొనండి. ఏ సమస్యకైనా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది.. టెన్షన్ పడితే ప్రయోజనమేమి ఉండదు. ఒత్తిడి, టెన్షన్ వల్ల పరిస్థితి మరింత ప్రభావితం అవుతుంది.
మీ నైపుణ్యాలకు పదును పెట్టండి
చాలా మంది మహిళలు ఫ్యామిలీ, పిల్లల కెరీర్ గురించి ఆలోచిస్తూ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచించడమే మానేస్తారు. కొంత మందిలో చాలా క్రియేటివ్ ఆలోచనలు ఉంటాయి. కావున టెన్షన్, ఒత్తిడిగా ఉన్న సమయాల్లో మీ ఇష్టమైన పనులపై శ్రద్ధ పెట్టండి. అవి మీ ఆలోచనలను డీవియేట్ చేయడానికి సహాయపడతాయి. ఫ్యామిలీ, వర్క్ లైఫ్ రెండింటినీ సమానంగా చూస్తే మీ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.
Also Read: Hair Health: మీకు ఈ అలవాట్లు ఉంటే చిన్నతనంలోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది!