/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Nagarjuna-Sagar-1.jpg)
Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌లో ప్రమాదం సంభవించింది. సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆగస్ట్ 1న ఈ రిటెయినింగ్ వాల్ కూలిపోగా.. ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. కూలీలు షిఫ్టు మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. క్షణాల్లో పంప్ హౌస్ జల దిగ్బంధమైంది. హైదరాబాద్ తాగు నీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయం డెడ్‌స్టోరేజీ నుంచి కృష్ణాజలాల తరలింపు కోసం సుంకిశాల పథకం చేపట్టారు. కాగా అధికారుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.