/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Kantilal-Bhuria.jpg)
Kantilal Bhuria: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయంగా మారాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు కాంతిలాల్ భూరియా తమ పార్టీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలోని మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరు భార్యలు ఉన్న పురుషులకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు.
ALSO READ: బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు బిగ్ షాక్
ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.."కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష జమ చేస్తామని మా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇద్దరు భార్యలు ఉన్న వారికి రూ. 2 లక్షలు అందజేస్తాం" అని అన్నారు. భూరియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ జితు పట్వారీ కూడా సమావేశానికి హాజరైనట్లు ఒక ఆంగ్ల పత్రిక పేర్కొంది. కాగా కాంగ్రెస్ నేత కాంతిలాల్ భూరియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తోంది. హిందూ సంప్రదాయాన్ని కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొంది.
ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత నరేంద్ర సలూజా భూరియా చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. "దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాధినేతపై కాంగ్రెస్ రత్లాం అభ్యర్థి కాంతిలాల్ భూరియా ఎన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు... కాంగ్రెస్ ఆలోచనా దౌర్భాగ్యం అలాంటిది.. కొన్నిసార్లు జ్యూస్, కొన్నిసార్లు షుగర్ సిరప్, ఈ రోజు ఇద్దరిని పెళ్లి చేసుకుంటారా, నగ్నంగా?..ఇదీ వారి పరిభాష.. ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాలి" అంటూ రాసుకొచ్చారు.
देश के 140 करोड़ लोगो का प्रतिनिधित्व करने वाले , देश के मुखिया के बारे में कितनी आपत्तिजनक टिप्पणी कांग्रेस के रतलाम के प्रत्याशी कांतिलाल भूरिया की...
ऐसी है कांग्रेस की घटिया सोच...
कभी रस , कभी चासनी , आज दो शादी , नंगा...?
यह इनकी शब्दावली है....
चुनाव आयोग @ECISVEEP… pic.twitter.com/FoxGhNwRz1
— Narendra Saluja ( मोदी का परिवार ) (@NarendraSaluja) May 9, 2024