Men Fertility: మగాళ్లూ బీ అలర్ట్.. ఇకపై వీటిని మార్చుకోండి.. లేదంటే ఆ పనికి పనికిరారు..!

పురుషుల్లో వంధ్యత్వం బారిన పడుతున్న వారు భారీగా పెరిగిపోతున్నారు. ఊబకాయం, ఒత్తిడి, సరైన ఆహారం తినకపోవడం, మాదకద్రవ్యాల వినియోగం, మద్యపానం, ధూమపానం, ఇతర వైద్య పరమైన కారణాల వల్లే ఇది జరుగుతుంది. జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

New Update
Men Fertility: మగాళ్లూ బీ అలర్ట్.. ఇకపై వీటిని మార్చుకోండి.. లేదంటే ఆ పనికి పనికిరారు..!

Men Fertility Care Tips: మన దేశంలో చాలా మంది జంటలు పిల్లలు పుట్టక ఎంతో క్షోభకు గురవుతున్నారు. అయితే, పిల్లల పిట్టకపోతే.. ముందుగా ఆడవారినే నిందిస్తుంటుంది ఈ సమాజం. స్త్రీని లక్ష్యంగా చేసుకుని అడ్డమైన కారుకూతలు కూస్తారు కొందరు. అయితే, గర్భధారణకు పురుషుడి శుక్రకణం ఎంత ముఖ్యమో.. స్త్రీ అండం కూడా అంతే ముఖ్యం. ఈ విషయం ఇప్పుడిప్పుడే చాలా మంది అవగతం అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. పిల్లలు పుట్టకపోతే కారణమేంటో తెలుసుకునేందుకు స్త్రీలతో పాటు.. పురుషులు కూడా సంతానోత్పత్తి పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే, ఇటీవలి కాలంలో వంధ్యత్వం బారిన పడే పురుషుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చాలా మంది పురుషులు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నారు. అయితే, పురుషుల్లో ఈ సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంధ్యత్వానికి కారణమేంటి? పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

వైద్య పరిభాషలో స్పెర్మ్ కౌంట్ తగ్గడాన్ని ఒలిగోస్పెర్మియా అని అంటారు. ఇక స్పెర్మ్ పూర్తిగా లేకపోవడాన్ని అజోస్పెర్మియా అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు. ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గినప్పుడు వంధ్యత్వం సమస్య వస్తుందని చెబుతున్నారు వైద్యులు.

తక్కువ స్పెర్మ్ కౌంట్ కారణాలు:

తక్కువ స్పెర్మ్ కౌంట్ అనేది పురుషుల వంధ్యత్వానికి నేరుగా సంబంధించిన సమస్య. ఇది వివిధ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం, ఒత్తిడి, సరైన ఆహారం తినకపోవడం, మాదకద్రవ్యాల వినియోగం, మద్యపానం, ధూమపానం, కీమోథెరపీ, వైద్యపరమైన సమస్యలు వంటి అంశాలు స్పెర్మ్ నాణ్యతను, సంఖ్యను తగ్గిస్తాయి.

1. జీవనశైలి కారకాలు:

జీవనశైలిలో కొన్ని అలవాట్లు స్పెర్మ్ కౌంట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ధూమపానం, అధిక మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం మరియు అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ తక్కువ స్పెర్మ్ కౌంట్‌కు దోహదం చేస్తాయి.

2. వైద్య సమస్యలు:

వివిధ వైద్య పరిస్థితులు స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వీటిలో ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, క్లైన్‌ఫెల్టర్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు ఉన్నాయి.

3. పర్యావరణ కారకాలు:

పురుగుమందులు అతిగా వినియోగించిన ఆహారం తినడం, కొన్ని లోహాలు, రేడియేషన్ వంటి పర్యావరణ టాక్సిన్‌లకు గురికావడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి దెబ్బతింటుంది.

4. వేడి:

వృషణాల చుట్టూ అధిక ఉష్ణోగ్రతలు (ఉదా. అధిక వేడి నీటితో స్నానం, బిగుతుగా ఉండే దుస్తులు, కంప్యూటర్ వేడి) స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

5. డ్రగ్ ఓవర్ డోస్:

ఔషధాలు అధికంగా తీసుకోవడం కూడా స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

Also Read:

కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్..

కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు..

Advertisment
తాజా కథనాలు