/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/memory-tips.jpg)
Brain Healthy: వయసు పెరిగే కొద్దీ మెదడు కూడా బలహీనంగా మారుతుంది. మెదడు పని సామర్థ్యం తగ్గుతుంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని ద్వారా ఆక్సిజన్ మెదడుకు చేరుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జ్ఞాపకశక్తి పెరగాలంటే:
జ్ఞాపకశక్తి సమస్యతో సతమతమవుతున్నవారు యోగా, స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్, వర్కవుట్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి.. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది, మనస్సును పదునుపెడుతుంది. ఉదయం ధ్యానం చేయాలి
మెదడు శక్తిని పెంచడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం. రోజూ వాకింగ్‌కి వెళ్లాలని నిర్ధారించుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు కూడా చేయాలి.
నాన్ వెజ్ తింటే అందులో చేపలను ఖచ్చితంగా తివాలి. ఆలివ్ ఆయిల్, నట్స్, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తప్పకుండా తినాలి. ఆల్కహాల్, పొగాకు, జంక్ ఫుడ్ అస్సలు తినవద్దని నిపుణులు చెబుతున్నారు.
బాదం పప్పును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే అనే రకాలు ప్రయోజనాలు ఉన్నాయి. అది మెదడుకు పదును పెట్టి జ్ఞాపకశక్తి సమస్య నుంచి కూడా ఉపశమనం ఇస్తుంది.
Also Read: ప్రెగ్నెన్సీలో లిప్ స్టిక్, ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..!