/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T110232.148.jpg)
Chiranjeevi: ఎయిర్పోర్ట్ లో మెగాస్టార్ చిరంజీవి ఓ అభిమాని పట్ల స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయంలో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఎయిర్ లైన్ ఉద్యోగిని నెట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ అభిమాని చిరంజీవితో ఫొటో క్లిక్ చేయడానికి ప్రయత్నించగా మొదటి సారి పట్టించుకోకుండా వెళ్లారు. ఆ తరువాత అతను మళ్ళీ సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. చిరంజీవి అతన్ని పక్కకు జరగమని నెట్టినట్లుగా వీడియోలో కనిపించింది. దీంతో అభిమాని పట్ల చిరంజీవి తీరు పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన పై కొందరు చిరంజీవిని విమర్శిస్తూ కామెంట్లు చేయగా.. మరికొందరు ఆయనను సమర్దించారు. చాలా దూరం ప్రయాణించి.. తన కుటుంబంతో కలిసి ఉన్న వ్యక్తిని అలా చేయడం తప్పు కదా, అతనితో పాటు ఉన్న గ్రౌండ్ స్టాఫ్ కూడా అతన్ని పక్కకు తప్పుకోమని అడిగారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పారిస్ ఒలింపిక్స్ వేడుకల కోసం కుటుంబంతో కలిసి ఇటీవలే పారిస్ వెళ్లారు.
Chiranjeevi Rude Behaviour with Fans Airport @KChiruTweets
— Kill Bill Pandey (@kill_billpanday) July 30, 2024
ఇది ఇలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇలాంటి ఘటనే ఎదురైంది. నాగార్జునతోఫొటో దిగేందుకు వచ్చిన ఓ అభిమానిని ఆయన బాడీ గార్డ్ నెట్టేయడంతో నాగార్జున విమర్శలను ఎదుర్కొన్నాడు. ఆ తరువాత తన బాడీ గార్డ్ చేసిన పొరపాటుకు నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు చెప్పారు.
Also Read: Turbo Movie: ఓటీటీలో మమ్ముట్టి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. - Rtvlive.com