Chiranjeevi - Revanth: రేవంత్‌రెడ్డిని కలిసిన మెగాస్టార్‌.. ఫొటోలు, వీడియో వైరల్‌!

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. రేవంత్ రెడ్డి నివాసంలో చిరంజీవి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన పొటోలు,వీడియో వైరల్‌గా మారాయి.

New Update
Bala Krishna: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నందమూరి బాలకృష్ణ..ఏం మాట్లాడుకున్నారంటే?

ఇద్దరికి ఇద్దరే.. ఎవరికి వారే పోటి. ఎవరికి వారే సాటి.. ఇద్దరూ కష్టపడే పైకి వచ్చారు. స్వశక్తితో ఎదిగారు.. ఒకరు సినీ ఇండిస్ట్రీని దశాబ్దాలపాటు ఏలితే.. మరొకరు తెలంగాణ కొత్త సీఎంగా రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) కలిశారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) నివాసంలో చిరంజీవి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. దీనికి సంబంధించిన పొటోలు,వీడియో వైరల్‌గా మారాయి. నిజానికి రేవంత్‌రెడ్డిను సీఎంగా ప్రకటించిన తర్వాత చిరంజీవి అందరికంటే ముందుగా అభినందించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. అలాగే విజయం సాధించిన మంత్రివర్గ సభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు.

2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. సామాజిక న్యాయమే తమ పార్టీ ప్రధాన ఎజెండాగా 2009ఎన్నికల బరిలో దిగారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని 294 స్థానాలకు గాను 18 స్థానాలను పార్టీ గెలుచుకుంది. 2011లో, భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రజారాజ్యాన్ని విలీనం చేశాడు. 2012లో రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. 2018 వరకు ఈ పదవిలో కొనసాగారు. ఇక ఆ తర్వాత చాలా కాలంగా రాజకీయాల్లో చిరు యాక్టివ్‌గా లేరు. టికెట్ల పెంపు వ్యవహారంపై గతంలో ఏపీ సీఎం జగన్‌ను కలిశారు చిరు.

ఇక ఆరు రోజుల క్రితం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిల్ రాజు నేతృత్వంలో కె. రాఘవేంద్రరావు, సురేష్ బాబు, ప్రసన్న, సి.కళ్యాణ్ తదితరులతో సహా టాలీవుడ్ ప్రతినిధులు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అధికారికంగా కలిశారు.
Also Read: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?

Advertisment
Advertisment
తాజా కథనాలు