మెగా అభిమానులు, మెగా ఫ్యామిలి ఇంట వేడుకలు షురూ అయ్యాయి. చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి రోజైన మంగళవారం నాడే మనువరాలు పుట్టడంతో చిరు సంతోషానికి అవధులు లేవు. అంతే కాదు... రామ్ చరణ్ ఉపాసన దంపతుల పాప తమ ఇంట లక్ష్మీదేవత అడుగుపెడుతుందని అంతేకాదు పుట్టిన పాపకు ఆంజనేయ స్వామి, శ్రీ రాముడి దీవెనలు ఉంటాయని అభిమానులు కోరుకుంటున్నారు.
మెగా మనవరాలు పుట్టిన నక్షత్రం పునర్వసు. శ్రీ రాముడి జన్మ నక్షత్రం కూడా పునర్వసే. మిథున రాశి, తెల్లవారితే మంగళవారం 1.49 నిమిషాలకు పాప జన్మించింది. ఇక చిరు ఇంటి కులదైవం ఆంజనేయ స్వామి అన్న విషయం తెలిసిందే. చిరంజీవి తల్లి పేరు కూడా అంజనా దేవి . మరి ఇప్పడు చిరు తన మనవరాలికి ఏం పేరు పెట్టనున్నారు..? అనేది అభిమానులకు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారింది. తల్లి పేరు కలిసి వచ్చేట్టు అంజనా దేవి అన్న పేరు పెడతారా? లేక చ ...జ... అనే అక్షరాలు కలిసి వచ్చేటట్టు పెడతారా అన్నది తేలియాల్సి ఉంది. శ్రీజ ,చరణ్ ... వంటి పేర్లు అంటే చిరంజీవికి చాలా ఇష్టమని పలు ఇంటర్వూల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు. మిథున రాశిలో పుట్టిన వారికి ఎక్కువగా కా...కీ...కే ....ఛ.... హ....హీ... వంటి అక్షరాలు వచ్చేటట్టుగా పేరు పెడతారు.
ఆంజనేయ స్వామి రోజైన మంగళవారం పాప పుట్టడంతో స్వామి పేరు కలిసి వచ్చేటట్టు పేరు పెడతారా అన్నది అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.అయితే ఇంతవరకూ చిరు కుమార్తెలకు ఆడపిల్లలే తప్ప మగ పిల్లలు లేరు. ఇప్పుడు రామ్ చరణ్ సతీమణీ కూడా ఆడపిల్లకే జన్మనివ్వడంతో మూడో తరం వారసుడు కోసం ఎదురు చూడక తప్పట్లేదు. అయితే ఇప్పుడు తన మనవరాలికి ఏం పేరు పెట్టాలన్న అంశంపై ఇప్పటికే మెగా ఫ్యామిలీ తర్జన, భర్జనలు పడుతున్నట్టు సమాచారం.