Inspiring Story : స్కూల్‌ డ్రాప్‌ అవుట్.. ఐస్‌క్రీములు అమ్మి వందల కోట్లు సంపాదించాడు..ఎవరో తెలుసా?

వందల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించాడు నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్. అతను స్కూల్‌ ఎగ్జామ్స్‌లో పాస్‌ కూడా అవ్వలేదు. ముందుగా పావ్‌ భాజీ బిజినెస్ స్టార్ట్‌ చేసిన కామత్‌ వందల కోట్లు ఎలా సంపాదించాడో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Inspiring Story : స్కూల్‌ డ్రాప్‌ అవుట్.. ఐస్‌క్రీములు అమ్మి వందల కోట్లు సంపాదించాడు..ఎవరో తెలుసా?
New Update

Viral News : చదువుకు సంపాదనకు సంబంధం లేదు. పీహెచ్‌డీ(PHD) లు చేసిన వారి కంటే పానీపూరి(Pani Puri) బండి పెట్టుకున్న వారికే డబ్బులు ఎక్కువ రావొచ్చు.. అంటే అందరూ ఇలా సంపాదిస్తారని కాదు. ఏదైనా మార్కెటింగ్‌ స్ట్రాటజీ(Marketing Strategy) తెలిసి ఉండాలి. బిజినెస్‌ స్కిల్స్‌(Business Skills) తెలిస్తే దేశాన్నే గుప్పిట్లో పెట్టుకోవచ్చు.. ఇండియాలో జరుగుతున్నది కూడా అదే కదా..! అయితే బయట ప్రజలకు ఎక్కువగా తెలియని కొన్ని సక్సెస్‌ఫుల్‌ కథలుంటాయి. వారి ప్రొడెక్ట్స్‌ మన నిత్య జీవితం(Daily Life) లో భాగమైపోయినా ఆ కంపెనీకి సంబంధించిన వారి గురించి ఎక్కువగా తెలియదు. అలాంటి లిస్ట్‌లోనే ఉంటారు ప్రముఖ నేచురల్స్ ఐస్ క్రీమ్(Naturals Ice Creams) వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్.

స్కూల్‌ డ్రాప్‌ అవుట్:
కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపింపిన రఘునందన్ శ్రీనివాస్ కామత్(Raghunandan Srinivas Kamath) స్కూల్‌ ఎగ్జామ్స్‌(School Exams) లో కూడా పాస్‌ అవ్వలేదని తెలుసా? అతను స్కూల్‌ డ్రాప్‌ అవుట్. కామత్ తండ్రి కర్ణాటకలో చిన్న పండ్ల వ్యాపారి. ఆయన మంగుళూరులోని ఒక చిన్న గ్రామంలో తన తండ్రికి సహాయం చేస్తూ పేదరికంతో పోరాడుతూ పెరిగాడు. ఆ తర్వాత పండిన పండ్లను తీయడం,క్రమబద్ధీకరించడం, భద్రపరిచే పద్ధతిని తెలుసుకున్నాడు. కామత్ చదువులో రాణించలేకపోయాడు. స్కూలింగ్‌లో ఫెయిల్‌ అయ్యాడు. తన తండ్రి వ్యాపారాన్ని విడిచిపెట్టి 14 ఏళ్ళ వయసులో మంగళూరు నుంచి ముంబైకి మారాడు.

Raghunandan Srinivas Kamath రఘునందన్ శ్రీనివాస్ కామత్

పావ్‌ భాజీతో మొదలైన వ్యాపారం:
కామత్‌ ముంబై(Mumbai) కి మారిన తొలి రోజుల్లో తన సోదరుడి సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌లో పని చేశాడు. అయితే ఆ సమయంలో అతనికి సపరేట్‌ బిజినెస్‌ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఐస్‌క్రీమ్‌పై మక్కువ పెంచుకున్నాడు. సొంతంగా ఏదైనా చేయాలనుకున్న కామత్‌ ఫిబ్రవరి 14, 1984న కేవలం నలుగురు సిబ్బందితో నేచురల్‌ ఐస్ క్రీమ్‌ వ్యాపారాన్ని స్థాపించాడు. ఐస్ క్రీం చేయడానికి పండ్లు, పాలు, చక్కెరను మాత్రమే ఉపయోగించాడు. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కామత్ పావ్ భాజీని ప్రధాన వంటకంగా, ఐస్ క్రీంను సెకండరీ వంటకంగా అందించడం ప్రారంభించాడు. అయితే అద్భుతమైన రుచి కారణంగా ఇది ఐస్ క్రీం పార్లర్‌గా ప్రసిద్ది చెందింది. ప్రత్యేకమైన ఐస్ క్రీం బ్రాండ్‌ను నిర్మించడానికి పావ్ భాజీని అమ్మడం మానేశాడు కామత్‌.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 135 ప్రాంతాల్లో నేచురల్‌ ఐస్‌క్రీమ్‌ షాపులు ఉన్నాయి. ఈ స్టోర్లలో 20 రకాల రుచుల్లో ఐస్ క్రీమ్‌లను విక్రయిస్తారు. 2020 ఆర్థిక సంవత్సరంలో నేచురల్స్ ఐస్ క్రీమ్ రిటైల్ టర్నోవర్ దాదాపు రూ. 400 కోట్లు. అందుకే కామత్‌ను 'ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా'(Ice Cream Man Of India) అని పిలుస్తారు.

Also Read : ఫొటోగ్రాఫర్‌ను హత్య చేసిన షణ్మఖ్.. కారణం ఇదే

#viral-news #raghunandan-srinivas-kamath #natural-ice-creams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe