Meera Jasmine : టాలీవుడ్ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్!

ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది.. శ్రీవిష్ణు 'స్వాగ్' సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మీరా జాస్మిన్ మహా రాణిలా ముస్తాబై ఆకట్టుకుంటుంది.

New Update
Meera Jasmine : టాలీవుడ్ యంగ్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్!

Actress Meera Jasmine In Sree Vishnu's Swag Movie : ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో మీరా జాస్మిన్ కూడా చేరిపోయింది. ఒకప్పుడు తెలుగులో భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి సినిమాలతో హీరోయిన్ గా అలరించిన మీరా జాస్మిన్ 2014 లో పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది.

కొన్నేళ్ల తర్వాత భర్తతో విడాకులు తీసుకుని ఇటీవల ఓ మలయాళం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఓ తమిళ్ సినిమా చేసింది. ఇక గత ఏడాది వచ్చిన 'విమానం' మూవీలో చిన్న పాత్ర లో మెరిసిన ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో ఫుల్ లెన్త్ రోల్ లో అలరించేందుకు సిద్ధం అయింది. అదికూడా యంగ్ హీరో శ్రీవిష్ణు సినిమాతో కావడం విశేషం..

Also Read : రాజమౌళి – మహేష్ మూవీలో హీరోయిన్ ఫిక్స్.. సూపర్ స్టార్ కోసం బాలీవుడ్ బ్యూటీ!

అదిరిపోయిన ఫస్ట్ లుక్...

సామజవరగమన, ఓం భీం బుష్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీవిష్ణు.. త్వరలోనే 'స్వాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీవిష్ణు నటించిన 'రాజ రాజ చోర' మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మీరా జాస్మిన్ మహా రాణిలా ముస్తాబై ఆకట్టుకుంటుంది. పోస్టర్ ని బట్టి సినిమాలో ఆమె రోల్ కీలకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు