Meena: యంగ్ హీరోతో ప్రేమ.. మీనా రెండో పెళ్లికి రెడీ అయింది నిజమేనా?

భర్త విద్యాసాగర్ చనిపోయిన తర్వాత రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వస్తున్న వార్తలపై మీనా ఆందోళన వ్యక్తం చేసింది. హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడం దురదృష్టకరమని, ఇది తననెంతో బాధించిందని చెప్పింది. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.

New Update
Meena: యంగ్ హీరోతో ప్రేమ.. మీనా రెండో పెళ్లికి రెడీ అయింది నిజమేనా?

Tollywood: సీనియర్ నటి మీనా రెండో పెళ్లి వ్యవహారం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అంతేకాదు భర్త ఉండగానే ఆమె మరో యంగ్ హీరోతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకుందంటూ వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఇటీవల మీనా భర్త అకాల మరణం పొందడంతో ఆమె వ్యవహారంలో మరింత జోక్యం చేసుకోవడం మొదలుపెట్టిన నెటిజన్లు.. రకరకాల వాదనలకు తెరలేపారు. అయితే వీటన్నింటిపై ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నటి ఓ కార్యక్రమంలో ఎట్టకేలకు ఓపెన్ అయింది.

ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నా..
ఈ మేరకు మీనా మాట్లాడుతూ.. 'నా భర్త విద్యాసాగర్ మృతితో విషాదంలో కూరుకుపోయిన నేను.. ఇప్పుడిప్పుడే తెరుకుంటున్నాను. భర్తను కోల్పోయిన విషాదం నుంచి బయటపడేందుకు సినిమాలతో బిజీ అవుతున్నా. కెరియర్‌పై మళ్లీ ఫోకస్ చేస్తున్నా. కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలాకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండోపెళ్లి వార్తలు నిజంగా బాధించాయి' అని చెప్పింది.

ఇది కూడా చదవండి: Ananya Pandey: మా బంధాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.. ట్రోల్స్‌పై నటి కౌంటర్!

ధనుష్‌తో సంబంధం..
అలాగే.. 'తమిళ నటుడు ధనుష్‌తో సంబంధం అంటగట్టడం దురదృష్టకరం. జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. భర్త చనిపోతారని అస్సలు ఊహించలేదు. జీవితం గురించి ప్రస్తుతానికైతే ఏమీ ఊహించుకోవడం లేదు. భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాల్సిందేనా?' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం మీనా వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు, ఫ్యాన్స్ పాజిటీవ్ గా స్పందింస్తున్నారు. పలువురు ప్రముఖులు ఆమెకు బాసటగా నిలస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు