కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. 20వ పిల్లర్ బేస్‌మెంట్ దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3వ బ్లాక్ అంతకంతకూ డ్యామేజ్ అవుతోందని సమాచారం. సాయంత్రంలోపు కూలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనాస్థలిని ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో పరిస్థితిపై ఉన్నతాధికారులు అత్యవసర సమీక్ష నిర్వహించారు. అయితే.. అధికారులు మాత్రం ఈ ఘటనపై ఇంతవరకు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోలీసుల ఆంక్షలు విధించారు. ప్రతిపక్షాలు, మీడియాను అనుమతించడం లేదు.
ఇది కూడా చదవండి: TS Elections 2023: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. మిషన్ చాణక్య సంచలన సర్వే.. వివరాలివే!
బ్రిడ్జిపై ఐరన్ గేట్ ఏర్పాటు చేయడంతో బ్రిడ్జి కూలే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికారుల తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. బ్యారేజ్ వద్దకు కాసేపట్లో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేరుకునే అవకాశం ఉంది. మరో వైపు యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయిర్ ను ఖాళీ చేశారు అధికారులు. దీంతో ప్రస్తుతం రిజర్వాయిర్ లో కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. దీంతో బ్యారేజీ గేట్లను మూసివేశారు.
ఈ ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర స్థాయిలో స్పందించారు. లక్ష్మీ బ్యారేజ్ వద్ద పిల్లర్ కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి కేసీఆర్, కాంట్రాక్టర్లు రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి, ఈసీ, గవర్నర్ విచారణకు ఆదేశించాలన్నారు. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ తమతో కలిసి మేడిగడ్డకు రావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.