Crime : మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!

సంగారెడ్డిలో మెడికో రచనా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. మరో నెల రోజుల్లో పెళ్లి ఉండగా.. ఆమె పటాన్‌ చెరు వద్ద కారులో విగత జీవిగా పడి ఉంది. చేతికి పాయిజన్‌ ఇంజక్షన్‌ తీసుకుని చనిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Crime : మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!
New Update

Medico Student : సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్‌ చెరులో(Patancheru)  విషాదం చోటు చేసుకుంది. ఓ మెడికో విద్యార్థి(Medico Student) ని మరో నెలరోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన అమ్మాయి కారులో విగత జీవిగా పడి ఉంది. విద్యార్థినిది ఆత్మహత్య లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారో తెలియడం లేదు. ఈ అనుమానస్పద మృతి గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఖమ్మంలోని మమత మెడికల్‌ కాలేజీలో(Mamata Medical College) రచనా రెడ్డి(25)(Rachana)  పీజీ మెడికల్‌ స్టూడెంట్‌ గా ఉంది. ప్రస్తుతం రచనా బాచుపల్లిలోని మమత కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తుంది. అయితే సుల్తాన్‌ పూర్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద రచనా కారులో స్పృహలేకుండా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసుల కు సమాచారం అందించారు.

వారు రచనాని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు రచనా చేతికి కలనెల్ ఉంది. అంటే రచనా ఏదైనా పాయిజన్‌ ఇంజక్షన్‌ చేసుకుని చనిపోయినట్లు వైద్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కారులో డ్రైవర్‌ సీటులో రచనా బెల్ట్‌ పెట్టుకుని ఉంది. కారులో కేవలం రచనా ఒకటే ఉందా లేక మరెవరైనా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రచనా తల్లిదండ్రులు బీహెచ్‌ఈఎల్‌(BHEL) లో ఉంటారు. అయితే గతేడాది నవంబర్‌ లో రచనాకు నిశ్చితార్థం కాగా.. ఈ మార్చిలో ఆమె పెళ్లి. ఈలోపే రచనా ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రచనా మృతదేహనికి పోస్టుమార్టం కోసం మమతా ఆసుపత్రి నుంచి పటాన్‌ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Also read: వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా పూజించాల్సిందే!

#khammam #mamata-medical-college #medico-student #rachana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe