/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Diwali-2-jpg.webp)
Tirupati police: రాష్ట్ర డీజీపీ కేవీ. రాజేంద్రనాథ్‌రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందికి ఎలాంటి ఘటనలు జరగకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా గతంలో దీపావళి సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఈ బాణసంచా తయారు చేసి విక్రయించే దుకాణాల నిర్వహకులతో సమావేశాలు నిర్వహించారు. ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా, టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన, బాణాసంచా విక్రయించే దుకాణదారులు పోలీసులు సూచించిన నియమ నిబంధనలను తప్పని సరిగా పాటించకపోయినా అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి:కాంగ్రెస్, బీజేపీ హామీలకి ప్రజలు మోసపోవద్దు: మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరిక
కాగా.. జిల్లాలో స్థానికంగా మందుగుండు సామాగ్రి తయారు చేసే ప్రాంతాలు, దీపావళి మందుగుండు సామాగ్రి స్టోరేజ్ గోడౌన్లు మరియు అమ్మకాలు జరిగే ప్రదేశాలపైన ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారీ చేసినా, విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే 100/112కి గాని.. మీ దగ్గరలోని స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తింపు
జిల్లావ్యాప్తంగా 4 మందుగుండు సామాగ్రి తయారు చేయు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలపై నిరంతర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. మందుగుండు సామాగ్రి నిల్వ చేసుకునేందుకు దీపావళి జిల్లా వ్యాప్తంగా 23 లైసెన్సులు జారీ అయ్యాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా దీపావళి సందర్భంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇప్పటివరకు అధికారికంగా 147 షాపులకు లైసెన్సు మంజూరు చేశామన్నారు. గతంలో జరిగిన ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి ఇప్పటివరకు ఒకరిని బైండోవర్. చేయడంతో పాటు, 86 మందికి నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు.