Medak : మెదక్ లో విషాదం.. ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలి మృతి..!

మెదక్ జిల్లాలో పెంకుటిల్లు పైకప్పు కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. టేక్మాల్‌ మండలానికి చెందిన శంకరమ్మ రాత్రి ఇంట్లో నిద్రుస్తుండగా ఇంటి పైకప్పు మీదపడి అక్కడిక్కడే మృతి చెందింది. శంకరమ్మ భర్త దత్తయ్య సమాచారంతో స్థానికులు శిథిలాల కింద ఉన్న ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.

New Update
annamaianh crime news

House Collapse : మెదక్ జిల్లా (Medak District) లో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు నిద్రలోనే శాశ్వత లోకాలకు వెళ్ళిపోయింది. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పెంకుటిల్లి పైకప్పు కూలి అక్కడిక్కడే మృతి చెందింది.

పోలీసుల సమాచారం ప్రకారం.. మెదక్ మండలం టేక్మాల్ లో శంకరమ్మ(65), దత్తయ్య శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇంట్లో నివాసము ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐదుగురికి వివాహాలు అయ్యాయి. ఇద్దరు కుమార్తెలు జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. మరో కుమారుడు టేక్మాల్ లోనే తల్లిదండ్రులతో కాకుండా వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. శంకరమ్మ, దత్తయ్య దంపతులు మాత్రం అదే శిథిలావస్థలో ఉన్న ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే శనివారం రాత్రి శంకరమ్మ, దత్తయ్య ఇంట్లోని వేర్వేరు గదుల్లో నిద్రించారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురవడంతో ఇల్లు బాగా తడిసిపోవడంతో ప్రమాదవశాత్తు శంకరమ్మ నిద్రించిన గదిలోని దూలం విరిగి ఇంటిపైకప్పు ఆమెపై పడింది. దీంతో శంకరమ్మ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

తెల్లవారుజామున నిద్రలేచిన దత్తయ్య స్థానికులకు సమాచారం అందించడంతో శిథిలాల కింద ఉన్న వృద్ధురాలు శంకరమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం ఆమె కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తామని అన్నారు. మండల ఆర్డీవో రమాదేవి, తహసీల్దారు తులసీరాం కూడా ఘటన స్థలానికి చేరి పరిశీలించారు.

Also Read: ANU College: నాగార్జున యూనివర్సిటీలో విషాదం.. పాము కాటుకు బలైన విద్యార్ధి.! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు