Mayawati : బీఎస్సీ నేత డెడ్ బాడీ చూసి కన్నీరు పెట్టుకున్న మాయావతి.. పార్టీ శ్రేణులకు కీలక పిలుపు! దారుణ హత్యకు గురైన తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయానికి బీఎస్పీ అధినేత మాయావతి నివాళి అర్పిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులు శాంతియుతంగా ఉండాలని సూచించారు. By srinivas 07 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Mayawati Is Emotional On Armstrong Murder : తమిళనాడు (Tamilnadu) బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య ఘటనపై మాయావతి (Mayawati) స్పందించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ శ్రేణులలు శాంతియుతంగా ఉండాలని సూచించారు. ఆమె ఎమోషన్ అయిన వీడియో వైల్ అవుతోంది #WATCH | Chennai, Tamil Nadu: BSP Chief Mayawati and party's National Coordinator, Akash Anand pay their last respects to Tamil Nadu BSP President K Armstrong. K Armstrong was hacked to death by a group of men near his residence in Perambur on 5 July. pic.twitter.com/4kQImXFYX9 — ANI (@ANI) July 7, 2024 సత్వరమే చర్యలు చేపట్టండి.. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన మాయవతి.. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధకరమన్నారు. దారుణ హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో పార్టీ కోసం అంకితభావంతో, కష్టించి పని చేసే బీఎస్పీ నేత కె.ఆర్మ్ స్ట్రాంగ్ కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా.. సత్వరమే చర్యలు చేపట్టాలని స్టాలిన్ ప్రభుత్వానికి సూచించారు. ఎలా జరిగిందంటే.. శుక్రవారం రాత్రి పెంరంబుర్‌లో రొడ్డుమీద కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆర్మ్‌స్ట్రాంగ్ (Armstrong) పై ఆగంతకులు కత్తులతో దాడి చేసి నరికి చంపారు. ఫుడ్ డెలివరి బాయ్స్ డ్రస్ వేసుకుని ఆరు బైకులపై వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఆర్మ్ స్ట్రాంగ్ దారుణ హత్య నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఈ హత్యను సీబీఐకి అప్పగించాలని వారంతా డిమాండ్ చేశారు. ఈ హత్యకు కారణమైన ఆరుగురిని అరెస్ట్ చేశామని చెన్నై అడిషనల్ కమిషనర్ అస్రా గార్గ్ తెలిపారు. దీనిపై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ స్పందిస్తూ.. ఈ దారుణ హత్య తనను షాక్‌కు గురి చేసిందని చెప్పారు. ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి, పార్టీకి తన ప్రగాఢ సానుభూతిని సీఎం తెలియజేశారు. ఈ హత్య కేసు దర్యాప్తు వెంటనే చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. Also Read : మాజీ సీఎం జగన్‌పై దాడి!.. కడపలో టెన్షన్ #tamilnadu #mayawati #armstrong మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి