New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ts-ceo-jpg.webp)
Telangana: తెలంగాణలో ఉద్యోగులకు మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ సీఈవో వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణలో పని చేస్తున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ ఉద్యోగులు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ రాష్ట్రానికి వెళితే వారికి కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు, ఏపీలోనూ ఉద్యోగులకు మే 13న సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా కథనాలు