మాథ్స్ స్టూడెంట్స్ కూడా డాక్టర్ కావొచ్చు.. ఈ ఏడాది నుంచే ఆ అదిరిపోయే ఛాన్స్!

ఇంటర్ లో ఎంపీసీ చదివినా మెడిసిన్ చదివేందుకు నీట్ లో పరీక్ష రాసేందుకు ఎన్ఎంసీ అవకాశం ఇవ్వన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవకాశం ఇస్తే ఎంపీసీ చదివినా డాక్టుర్లు కావచ్చు.

New Update
మాథ్స్ స్టూడెంట్స్ కూడా డాక్టర్ కావొచ్చు.. ఈ ఏడాది నుంచే ఆ అదిరిపోయే ఛాన్స్!

చాలా మంది ఇంటర్ లో మాథ్స్ చదవి.. తర్వాత డాక్టర్ అవ్వాలని కోరిక కలిగినా అవకాశం లేకపోవడంతో నిరుత్సాహ పడుతుంటారు. అలాంటి వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇలాంటి వారికి ఇంటర్ లో మిస్ అయిన బయోలజీ తదితర అంశాలపై ప్రత్యేక తరగతులు ఉండే అవకాశం ఉంది.అంతేకాదు సిలబస్ లో మార్పులు కూడా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటర్మిడియేట్ లో ఎంపీసీలో చేరి తర్వాత...మెడిసిన్ చదువుదాం అనుకునే చాలా మంది విద్యార్థులకు ఎన్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎంపీసీ చదివినా నీట్ యూజీ పరీక్ష రాసేందుకు పర్మిషన్ ఇచ్చింది. గతంలో ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వారికి మాత్రమే నీట్ రాసే ఛాన్స్ ఉండేది. తర్వాత బయో టెక్నాలజీ చదవిని వారికి కూడా ఛాన్స్ ఇచ్చారు. తాజాగా మ్యాథ్స్ చదివిన వారికి కూడా నీట్ రాసేందుకు అనుమతి ఇచ్చింది.

అయితే వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని, అదనంగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ లేదా బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకుని ఉత్తీర్ణులు కావాలని నిబంధనలు విధించింది. వారి MBBS, BDS కోర్సులు చేసేందుకు అర్హులని పేర్కొంది. వచ్చే ఏడాది విడుదల చేయనున్న నీట్ యూజీ నోటిఫికేషన్ నుంచే వీరికి ఛాన్స్ కల్పించనున్నట్లు సమాచారం.

అటు గ్రూప్ 2 పరీక్షలపై టీఎస్పీఎస్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్ 2 నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం లేఖ రాశారు. వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. పలు కారణాలతో రాష్ట్రంలో గత సర్కార్ హయాంలో టీఎస్పీఎస్సీ పరీక్షలు పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్పీఎస్సీని ప్రకాక్షళన చేయాలన్ని డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. 

ప్రస్తుతం ఉన్న కమిషన్ పై తమకు నమ్మకంలేదంటూ..కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన ఫిర్యాదులు, డిమాండ్ల మేరకు తాము మళ్లీ అధికారంలోకి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు చేస్తామని గత ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసి నియామకాలను చేపడతామని పేర్కొంది. అన్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ కలెక్టర్లకు టీఎస్పీఎష్సీ సెక్రటరీ లేఖ రాయడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: రేవంత్‌ను సీఎం చేయొద్దు.. సీనియర్లు బలంగా వినిపిస్తున్న 4 వాదనలు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు