ఈ ఫాగ్(పొగమంచు) ఎక్కడ నుంచి వచ్చిందిరా బాబు.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొత్తం స్టేడియాన్ని కమ్మేసింది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫాగ్ కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయర్ అయ్యర్ ఉన్నారు.
Also Read: ‘ఫ్రెండ్‌షిప్ కోటాలో అతడిని ఆడిస్తున్నారా’? ‘రోహిత్.. ఏంటిది?’
లక్ష్యఛేదనలో భారత్‌కు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తు చెలరేగిపోయాడు. దూకుడు అస్త్రంతో న్యూజిలాండ్‌కి మంచులోనూ చెమటలు పట్టించాడు. తన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో అలరించాడు. హాఫ్ సెంచరీవైపు సాగుతున్న రోహిత్ శర్మను లాకీ ఫెర్గుసెన్ వికెట్ల ముందు లాక్ చేశాడు. రోహిత్ బౌల్డ్ అయ్యాడు. 40 బంతుల్లో 46 రన్స్ చేశాడు రోహిత్ శర్మ. అందులో ఏకంగా నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. అంటే కేవలం బౌండరీల ద్వారానే రోహిత్ 40 రన్స్ చేశాడు. ఇప్పటికే సిక్సులు విషయంలో అనేక రికార్డులు సృష్టించిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. మరో ఎండ్‌లో గిల్ కూడ మంచి క్లాస్ కనబరిచాడు. 31 బంతుల్లో 26 పరుగులు చేసిన గిల్.. లాకీ ఫెర్గుసన్‌కు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అయ్యర్, కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆడుతున్నారు. ముఖ్యంగా అయ్యర్ బౌండరీలతో అలరిస్తున్నాడు. ఇక నిలిచిపోయిన మ్యాచ్ మళ్లి కాసేపటికే ప్రారంభం అయ్యింది.
రాణించిన రచిన్, మిచెల్:
ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. షమి 5 వికెట్లతో సత్తా చాటాడు. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర, డారిన్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మిచెల్ సెంచరీతో అదరగొట్టాడు. అటు రచిన్ తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తు హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక నిలిచిపోయిన మ్యాచ్ మళ్లి కాసేపటికే ప్రారంభం అయ్యింది.
Also Read: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?