Fact Check: హస్తప్రయోగం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..?

హస్తప్రయోగానికి, వీర్యం లోపానికి ప్రత్యక్ష సంబంధం లేదంటున్న వైద్యులు. మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Fact Check: హస్తప్రయోగం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా..?
New Update

Fact Check: మన సమాజంలో ఇప్పటికీ లైంగిక విద్యకు సంబంధించి అవగాహన తగ్గింది. సరైన సమాచారం తెలికకపోవడం వల్ల ప్రజలు ఏది విన్నా అది నిజం అని నమ్ముతున్నారు. తరచుగా వ్యక్తులు లైంగిక విషయాలను ఎవరితోనూ చర్చించకుండా ఉంటారు. అనేక సమస్యలు ఉన్నప్పటికీ వైద్యుల సలహా తీసుకోకుండా తప్పించుకునే వారు చాలా మంది ఉన్నారు. అయితే హస్త ప్రయోగం వల్ల శరీరం బలహీనపడుతుందని, సంతానలేమికి కూడా కారణమవుతుందని చెబుతున్నారు.

హస్తప్రయోగం స్పెర్మ్ కౌంట్‌ తగ్గుతుందా?:

హస్తప్రయోగం స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా వంధ్యత్వానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. హస్తప్రయోగం కారణంగా వీర్యం లేకపోవడం లేదా తక్కువ స్పెర్మ్ కౌంట్ గురించి ఎన్నో అపోహలు ఉంటాయి. వైద్యులు చెబుతున్నదాని ప్రకారం హస్తప్రయోగానికి, వీర్యం లోపానికి ప్రత్యక్ష సంబంధం లేదు. ఎక్కువగా హస్తప్రయోగం చేసుకునే వారు కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం పడదు. వీర్యం శరీరంలో అన్ని సమయాలలో ఉత్పత్తి అవుతుంది. హస్తప్రయోగం వల్ల వీర్యం లేకపోవడం అనేది అవాస్తవం అని చెబుతున్నారు.

వీర్యం లోపం ఎలా ఏర్పడుతుంది?:

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి అనేక కారణాలు కారణం కావచ్చు. ఆహారం, జీవనశైలి, శారీరక ఆరోగ్య పరిస్థితులు కూడా స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయి. తక్కువ స్పెర్మ్ కౌంట్ వెనుక ఉన్న కొన్ని ప్రధాన కారణాలు ఇవి.

1. ఊబకాయం కారణంగా
2.ఎక్కువగా మందులు తీసుకోవడం
3. వృషణాలు వేడెక్కడం
4. లైంగికంగా సంక్రమించే వ్యాధులు
5. ఒత్తిడి, మానసిక సమస్యలు
6. అసమతుల్య ఆహారం
7. మద్యం, ధూమపానం తీసుకోవడం

1-2 రోజులు కంటిన్యూగా హస్తప్రయోగం చేసిన తర్వాత కొన్ని రోజులు ఆపివేస్తే మళ్లీ స్పెర్మ్ కౌంట్ నార్మల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. మీరు నిరంతరం హస్తప్రయోగం చేస్తుంటే స్పెర్మ్ రికవరీ వేగంగా జరిగేలా మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తాయని, వంధ్యత్వానికి కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే మంచి ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పేస్‌మేకర్ ఆపరేషన్‌ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#best-health-tips #mastrubation #mastrubation-side-effects
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి