Kerala : విరిగిపడ్డ కొండ చరియలు.. ఏడుగురి మృతి..!

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా వందలాది మంది ప్రజలు ఆ భారీ కొండ చరియల కింద చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య!
New Update

Wayanad : కేరళ (Kerala) లోని వయనాడ్‌ జిల్లా (Wayanad District) లో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా వందలాది మంది ప్రజలు ఆ భారీ కొండ చరియల (Landslides) కింద చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే... కేరళ విపత్తు నిర్వహణ దళం , అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కొండచరియలు విరిగిపడిన స్థలానికి చేరుకుని సహయక చర్యలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలు అంతరాయం కలుగుతున్నట్లు అధికారులు వివరించారు.

Also read: పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్‌



#landslides #wayanad #kerala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe