Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య!

కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Wayanad Landslides: వాయనాడ్ లో మాటలకందని విషాదం.. 42కు పెరిగిన మృతుల సంఖ్య!
New Update

Wayanad Landslides: కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్‌ఎఫ్‌ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌ కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండ చరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.

ఇప్పటి వరకు 70 మందిని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మెప్పాడి ముండకైలో ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురుల్మల పట్టణంలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంత పెద్ద విపత్తును వయనాడ్‌ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదం పై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు , ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. వయనాడ్‌ జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండర్‌నాడ్‌ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ఈ ప్రమాదంలో మరణించింది.

Also read: అమెరికా మహిళను అడవిలో గొలుసుతో కట్టేసి..!

#kerala #landslides #wayanad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe