Massive Floods In Libya: డేనియల్ తుపాను (Daniel Storm)సృష్టించిన విలయంతో తూర్పు లిబియా (Libya) అతలాకుతలమైంది. జల ప్రళయంలో ఇప్పటికే 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వేలకు పైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసముండే డెర్నాలో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ఒక్క డెర్నాలోనే 5 వేల మందికిపైగా మరణించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు.
Also Read: వియాత్నంలో ఘోర అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి. 50మందికి పైగా మృతి..!!
లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లు, బ్రిడ్జీలు కనిపించని దారుణ పరిస్ధితి నెలకొంది. వందలాది డెడ్‌బాడీలు బురదలో కూరుకుపోయాయి. సహాయక చర్యలకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రెస్క్యూ సిబ్బంది వాపోతున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో తూర్పు లిబియాలోని చాలా నగరాలు ఎఫెక్ట్ అయ్యాయి. వరదల తాకిడికి ఎగువన ఉన్న డ్యామ్‌లన్నీ ఉప్పొంగి డెర్నాను ముంచెత్తాయి. దీంతో డెర్నా నగరం పూర్తిగా ధ్వంసమైంది. కార్లు, బైక్‌లు వరదలకు కాగితపు పడవల్లా తేలుతూ కొట్టుకుపోయాయి.
రోడ్లపైనే డెడ్‌బాడీలు..
డేనియెల్ తుఫాను ప్రభావంతో డెర్నా, జబల్ అల్ అఖ్దర్, అల్-మార్జ్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రభావిత నగరాల్లోని రోడ్లపైనే డెడ్‌బాడీలు పడి ఉన్నాయి. హాస్పిటల్స్ అన్నీ మృతదేహాలతో నిండిపోయాయి.సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఎంతమంది చనిపోయారన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 10 వేల మంది ఆచూకీ తెలియట్లేదని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్, రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది.
ప్రజల పరిస్ధితి అధ్వానం..
వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. డెర్నా పట్టణంలోని నదిపై ఉన్న ఆనకట్ట వరదలతో కూలిపోవడంతో విపత్తు సంభవించిందని లిబియా అధికారులు తెలిపారు. తీర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వరదల్లో మునిగిపోయాయని వివరించారు. మిస్రాటా సిటీ కూడా వరద తాకిడికి గురైంది. రెండు అప్‌స్ట్రీమ్ డ్యామ్‌లు పగిలిపోవడంతో వరదలు ముంచెత్తిందని.. వేలాది మంది ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. పోయిన వారం గ్రీస్‌ను కుదిపేసిన డేనియెల్ తుఫాన్.. ఆదివారం మెడిటరేనియన్ సముద్రాన్ని దాటింది. తీర ప్రాంతమైన డెర్నాను వరదలు ముంచెత్తాయి. రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రజల పరిస్ధితి అధ్వానంగా ఉంది. తమ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అస్సలు ఉన్నారో లేదో తెలియదంటూ కన్నీంటి పర్యతం చెందుతున్నారు.
Also Read: వియాత్నంలో ఘోర అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి. 50మందికి పైగా మృతి..!!