సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

New Update
సాహితీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం

Massive fire in Sahitya Pharma Company

పెద్ద ఎత్తున మంటలు

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాహితీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.

తీవ్ర భయాందోళనలో కార్మికులు

ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చుట్టు పక్కల మరిన్ని కంపెనీలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సమీపంలోని స్టీల్‌ప్లాంట్ సాయంతో అక్కడి ఫైరింజన్లను కూడా తీసుకువచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో కంపెనీలో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఉదయం సాహితి ఫార్మాలో 120 మంది కార్మికులు విధులకు హాజరయ్యారని తెలుస్తోంది. వారిలో ఎంతమంది గాయపడ్డారో వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు