Crime News: తమిళనాడులో దారుణం..స్పాట్‌లోనే ఏడుగురు మృతి..!

తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. పేలుడు ధాటికి మొత్తం ఏడుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

New Update
Crime News: తమిళనాడులో దారుణం..స్పాట్‌లోనే ఏడుగురు మృతి..!

Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. టపాకాయల తయారీకి ప్రసిద్ధి చెందిన శివకాశిలో భారీ పేలుడు సంభవించింది. ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. పేలుడు ధాటికి  స్పాట్‌లోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దాదాపు 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

publive-image

Also Read: భార్య ఇంట్లో లేని సమయంలో హత్య.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రవికుమార్‌ మృతిపై అనుమానాలు..!

అసలేం జరిగిందంటే.. బాణసంచా తయారీ కేంద్రంలో ముడి సరుకును లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు భారీ విస్పోటనం జరిగింది. ఈ ప్రమాదంలో పేలుడు ధాటికి స్పాట్‌లోనే ఏడుగురు ప్రాణాలు విడిచారు. అందులో ఐదుగురు మహిళలలే ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

publive-image

హుటాహుటినా అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, కార్మాగారంలో మందుగుండు సామగ్రి ఎక్కువ ఉండటంతో మంటలను అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు