Crime: సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు..ముక్కలు ముక్కలైన కార్మికులు

షాద్‌నగర్ లోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ క్లాస్ ప్రైవేట్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు కాగా ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
Crime: సౌత్ గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు..ముక్కలు ముక్కలైన కార్మికులు

Shadnagar Gas Factory : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో ఉన్న సౌత్ గ్లాస్ పరిశ్రమలో కంప్రెషర్‌ గ్యాస్ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. 8 మంది మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన కార్మికులను ఆస్పపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. అయితే పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికుల శరీర భాగాలు మొక్కలు ముక్కలుగా ఎగిరిపడ్డాయి. శరీరాల నుంచి ఒకవైపు కాళ్లు మరోవైపు చేతులు విడిపోయి ఎగిరి పడిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. అసలు ఎంతమంది చనిపోయారు..? ఎంతమందికి పూర్తిస్థాయిలో గాయాలయ్యాయి..? అనేది మాత్రం పూర్తిగా బయటికి రానివ్వడం లేదు.

ప్రస్తుత సమాచారం మేరకు మొత్తం 8 మంది మృతి  చెందగా ఇద్దరి మృతదేహాలు గుర్తించారు.  తీవ్రంగా గాయపడ్డ వారిని షాద్‌నాగర్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో  ముగ్గురు శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించినట్లు తెలిపిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:మీ ముఖంపై అవాంఛిత రోమాలు పెరుగుతున్నాయా? ఇలా వదిలించుకోండి!

Advertisment
తాజా కథనాలు