Andhra Pradesh: భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలు ధ్వంసం.. జాయింట్ కలెక్టర్ ఆగ్రహం విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఉన్నతాధికారులు స్పందించారు. భారీ యంత్రాలతో పనులు జరుగుతున్న ఆ ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ (JC), రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పరిశీలించారు. మట్టిదిబ్బల విధ్వంసం జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ జేసీ అధికారులపై మండిపడ్డారు. By B Aravind 17 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై తాజాగా ఉన్నతాధికారులు స్పందించారు. ప్రస్తుతం భారీ యంత్రాలతో పనులు జరుగుతున్న ఆ ప్రదేశాన్ని జాయింట్ కలెక్టర్ (JC), రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు పరిశీలించారు. భారీగా జేసీబీలతో పని చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటూ జాయింట్ కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధికారుల రాకను తెలుసున్న నిర్వాహకులు అంతకుముందే భారీ యంత్రాలను, లారీలను ఆ ప్రాంతం నుంచి పంపించివేశారు. Also read: GPS జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సీరియస్ గత వైసీపీ పాలనలో కూడా పర్యావరణ విధ్వంసం జరిగిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భౌగోళిక, వారసత్వ ప్రదేశంగా గుర్తించిన.. ప్రపంచ ప్రసిద్ధ ఎర్రమట్టి దిబ్బుల ముప్పు ముంగిట ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను ఆనుకుని పలు పనులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఆ భూముల్లో ఎర్రమట్టి దిబ్బలను భారీ యంత్రాలతో తవ్వి చదును చేస్తున్నారు. ఎంత వర్షం పడ్డా ఇక్కడి ఎర్రమట్టి దిబ్బలు నీరంతా భూమిలోకి ఇంకేలా చేస్తాయి. ఇలాంటి సున్నిత ప్రాంతానికి ఆనుకొని పనులు చేపట్టడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also read: నా బిడ్డకు తండ్రి అతనే.. లైవ్ లో శాంతి, మదన్ మాటల యుద్ధం! #red-mud-dunes #telugu-news #bhimili మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి