హైదరాబాద్‌లో భారీగా మత్తు పదార్ధాల పట్టివేత మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయని తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు సోదాలు చేస్తూ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు. తాజాగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ స్థాయిలో మత్తు పదార్థాలను పట్టుకొని పోలీసులు వాటిని ధ్వంసం చేశారు. By Vijaya Nimma 27 Jun 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి మాదకద్రవ్యాలు ధ్వంసం ప్రస్తుతం ధ్వంసం చేసిన మాదక ద్రవ్యాల విలువ విదేశీ మార్కెట్లో సుమారు రూ. 950 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 23 రకాల మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను దుండిగల్‌లోని భాగ్యనగర్‌లో వేస్ట్ మేనేజ్మెంట్ప్రాజెక్టులో అధికారులు ధ్వంసం చేశారు. 409 కిలోల ఆల్ఫాజోలం, 2655 కిలోల గంజాయి, 142 కిలోల ఎపిడ్రిన్ హైడ్రో క్లోరైడ్, 11 కిలోల హెరైన్, 74.92 కిలోల కెటమైన్, 2.95 కిలోల మెఫిడ్రోన్, 53.98 కిలోల మెటక్విలోన్, 55.95 కిలోల ఎఫిడ్రిన్ తయారీలో వాడే రసాయనాలను పూర్తిగా ధ్వంసం చేశారు పోలీసులు. కొంతకాలంగా కొకైన్ హెరాయిన్‌తోపాటు 16 రకాల డ్రగ్స్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మత్తుకు బానిసలు.. హైదరాబాద్‌లో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా..మత్తు పదార్థాల రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు. డబ్బుల కోసం భావితరాల యువతను నాశనం చేస్తున్నారు. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నారు. కఠిన శిక్షలు మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత మత్తు పదార్థాల మాయలో పడటం దురదృష్టకరమన్నారు. మత్తు బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ మత్తు పదార్థాల కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి