Ghee Beauty Tips: ప్రతిరోజూ నెయ్యితో ముఖంపై మసాజ్‌ చేస్తే ఎన్నో అద్భుతాలు

చర్మ వ్యాధులను నయం చేయడానికి నెయ్యిని ఆయుర్వేదంలో వాడుతారు. ఆవు నెయ్యిని స్నానం చేసేప్పుడు ఉపయోగిస్తారు. ఇది ఒక అద్భుతమైన చర్మ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Ghee Beauty Tips: ప్రతిరోజూ నెయ్యితో ముఖంపై మసాజ్‌ చేస్తే ఎన్నో అద్భుతాలు

Ghee Beauty Tips: నెయ్యిలో మంచి కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఆహారంలో నెయ్యిని రోజూ ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. శతాబ్దాలుగా బ్యూటీ ఉత్పత్తులలో నెయ్యిని ఉపయోగిస్తున్నారు. నెయ్యి చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్ చేస్తుంది. అంతేకాకుండా సహజమైన మెరుపు ఇస్తుంది. నల్ల మచ్చలను తగ్గిస్తుంది. రోజూ మన ముఖానికి నెయ్యి రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది:

  • చర్మ వ్యాధులను నయం చేయడానికి నెయ్యిని ఆయుర్వేదంలో వాడుతారు. ఆవు నెయ్యిని స్నానం చేసేప్పుడు ఉపయోగిస్తారు. ఇది ఒక అద్భుతమైన చర్మ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ముఖానికి నెయ్యి రాసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

చర్మం ప్రకాశవంతంగా మారుతుంది:

  • నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి చర్మానికి పోషణ అందిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ కారణంగా ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది:

  • నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా డార్క్‌ స్పాట్స్‌ కూడా పోతాయని నిపుణులు అంటున్నారు. నెయ్యిలో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు కళ్ల చుట్టూ ఉండే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలను తక్షణమే తొలగిస్తాయి.

దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది:

  • నెయ్యిలో విటమిన్ ఎ సమ్మేళనాలు, రెటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొత్త కణాల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అంతేకాకుండా పగిలిన పెదాలకు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. పడుకునే ముందు పెదవులపై పలుచని నెయ్యి రాసుకుంటే ఉదయం పెదాలు మృదువుగా మారుతాయి.

ఇది కూడా చదవండి: వేసవిలో రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగితే ఏం జరుగుతుంది?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు