నీతీశ్‌ వ్యాఖ్యలపై మేరీ మిల్బెన్‌ ఫైర్‌.. బిహార్‌కు మహిళా సీఎం కావాలంటూ

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వివాదాస్పద 'జనాభా నియంత్రణ' వ్యాఖ్యలపై అమెరికన్ స్టార్ సింగర్ మేరీ మిల్బెన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మహిళల గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదన్నారు. నితీష్ కామెంట్స్ ను ఖండిస్తూ ఆమె నెట్టింట ఓ పోస్ట్ షేర్ చేశారు.

New Update
నీతీశ్‌ వ్యాఖ్యలపై మేరీ మిల్బెన్‌ ఫైర్‌.. బిహార్‌కు మహిళా సీఎం కావాలంటూ

బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వివాదాస్పద 'జనాభా నియంత్రణ' వ్యాఖ్యలపై అమెరికన్ స్టార్ సింగర్ మేరీ మిల్బెన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మహిళల గురించి తప్పుగా మాట్లాడటం నచ్చలేదన్నారు. నితీష్ కామెంట్స్ ను ఖండిస్తూ మిల్బెన్‌ నెట్టింట ఓ పోస్ట్ షేర్ చేశారు.

ఈ మేరకు 'భారత సోదరసోదరీమణులకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా అమెరికా, భారత్‌లో 2024 ఎలక్షన్ సీజన్‌ మొదలైంది. కాలం చెల్లిన ఆలోచనలకు ముగింపు పలికి ప్రగతిశీల ఆలోచనలు చేసే అవకాశాన్ని ఈ ఎన్నికలు కల్పిస్తాయి. భారత ప్రధాని నరేంద్రమోడీకి ఎందుకు మద్దతు ఇస్తావని, భారత వ్యవహారాలపై ఎందుకంత ఆసక్తి చూపుతావని చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే నాకు భారత్ అంటే చాలా ఇష్టం. ప్రేమ. అమెరికా-భారత్ రిలేషన్, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి మోడీ నాయకత్వం సరైనదని నమ్ముతా' అంటూ చెప్పుకొచ్చింది.

Also read:మనిషి ప్రాణం తీసిన రోబో.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

అలాగే ప్రస్తుతం ఇండియా ఒక కీలకమైన సమయాన్ని ఎదుర్కొంటోంది. బిహార్‌లో మహిళలకు విలువనివ్వడమనేది సవాలుగా మారింది. దీనికి ఒకటే సమాధానం ఉందని నా నమ్మకం. నీతీశ్‌జీ వ్యాఖ్యల తర్వాత.. బిహార్‌ ముఖ్యమంత్రి పదవి కోసం ఒక ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాని చెప్పింది. నేను భారతీయ మహిళను అయ్యుంటే బిహార్‌కి వెళ్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసుండేదాన్ని. నీతీశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను అని తన అభిప్రాయం వెల్లడించింది. అంతేకాదు 'జవాన్‌' మూవీలో షారుక్‌ ఖాన్‌ 'ఓటు వేసి మార్పు తీసుకురండి' అని చెప్పారు. బిహార్‌ ప్రజలకు కూడా నేను ఇదే సూచిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు