Dil Raju: దిల్ రాజు ఇంట మొదలైన పెళ్లిసందడి.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు చెబుతున్నారు. దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. By Archana 29 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Dil Raju: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సందడి మొదలైందనే చెప్పాలి. తాజాగా దగ్గుపాటి కుటుంబంలో వెంకటేష్ చిన్న కూతురు ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఇంక వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలు ఇప్పటికే మొదలుకాగా.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహకు మురళీ మోహన్ మనవరాలు రాగాతో పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే దిల్ రాజు తండ్రి మరణంతో ఆయన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఒక శుభకార్యం చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నారట. ఈ నేపథ్యంలో దిల్ రాజు తమ్ముడి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా చెబుతున్నారు. ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆశిష్ మొదటి సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. ఆశిష్ వివాహం పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమని సమాచారం. ఆశిష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏపీకి చెందిన ఓ వ్యాపార వేత్త కుమార్తెగా చెబుతున్నారు. అయితే వీళ్లిద్దరి పెళ్లి చర్చలు దిల్ రాజు తండ్రి మరణానికి ముందే జరిగాయని అంటున్నారు. ఈ మ్యారేజ్ అధికార ప్రకటన త్వరలోనే రానున్నట్లు చెబుతున్నారు. వీళ్ళ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరుగబోతున్నట్లు సమాచారం. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంకో రెండు నెలల్లో నిశ్చితార్థం, ఫిబ్రవరి నెలలో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో దిల్ రాజు సోదరుడి కుమారుడు హర్షిత్ వివాహం కూడా ఏపీకి చెందిన రాజకీయ ఫ్యామిలీతో జరిగింది. ఇప్పుడు జరగనున్న ఆశిష్ వివాహం కూడా ఏపీకి చెందిన బిజినెస్ ఫ్యామిలీతో జరగడం ఆసక్తికరంగా మారింది. Also Read: Salaar Movie: రిలీజ్ కు ముందే రూ.175 కోట్ల కలెక్షన్స్.. దిమ్మతిరిగేలా సలార్ క్రేజ్..! #dil-raju-family #dil-raju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి