AP: సీఆర్డీఏ పరిధిలో మెగా హోమ్.. 2030 నాటికీ ఇదే టాప్ సిటీ: మార్కెటింగ్ మేనేజర్ 2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుందన్నారు మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు. దేశంలోనే టాప్ సిటీగా అమరావతి నిలుస్తుందన్నారు. సీఆర్డీఏ పరిధిలో మెగా హోమ్ మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు. By Jyoshna Sappogula 20 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాన ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి నగరం ఒక విజనరీ సిటీ అన్నారు. 2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుందని..దేశంలోనే టాప్ సిటీగా అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో మెగా హోమ్ మొదలు పెట్టినట్లు తెలిపారు. గొల్లపూడిలో అందరికి అందుబాటులో ప్రైమ్ లోకేషన్ లో వెంచర్ ఉందని.. సెక్రటేరియట్, విమానాశ్రయంకి కేవలం 30 నిమిషాల్లో వెళ్లొచ్చని తెలిపారు. రీమేక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ అనుబంధంగా ఈ మెగా ప్రాజెక్టు ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగానే రీమేక్స్ జూబ్లీ ప్రాపర్టీ పాట్నర్ హరనాథ్ రెడ్డి మాట్లాడారు. 11 దేశాల్లో ఈ రిమేక్ కంపెనీ ఉందని.. భారత్ దేశంలో మెగా ప్రాజెక్టుతో ముందుకు వచ్చమని తెలిపారు. NRI, లోకల్ ప్రజల అవసరాలను, అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు రూపొందించామన్నారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని..ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారన్నారు. గతంలో 6వేలు గజం నుండి నేడు 40 వేలకు వెళ్ళిందని..రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో అమరావతి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుందని కామెంట్స్ చేశారు. Also Read: హైదరాబాదాద్ వాసులకు రేవంత్ శుభవార్త.. మూసీ అభివృద్ధికి ఎన్ని వేల కోట్లంటే? #amaravati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి