Margadarshi Case: మార్గదర్శికి ఊరట.. ఆ పిటిషన్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు

రామోజీరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్‌ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయాలన్న సీఐడీ పిటిషన్ ను సస్పెండ్ చేసింది.

New Update
Margadarshi Case: మార్గదర్శికి ఊరట.. ఆ పిటిషన్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు

మార్గదర్శి చిట్‌ఫండ్‌పై (Margadarshi Chit fund) సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు (AP High Court) సస్పెండ్‌ చేసింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్‌ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయాలని సీఐడీ ఆయా మేనేజర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ బ్రాంచ్ మేనేజర్లు హైకోర్టులో నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ సైతం పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ పిటిషన్ ను సస్పెండ్ చేసింది. అయితే.. ఈ కేసులో సీఐడీ విచారణ జరపవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కానీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం కుదరదని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Chandrababu Skill Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడే హైకోర్టులో విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ

ఇదిలా ఉంటే..  మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై (Margadarshi) విచారణను ఏపీ హైకోర్టు 8 వారాల పాటు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం… యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తును 8 వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సీఐడీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Jagananna Chedodu: ఏపీలో వారికి గుడ్ న్యూస్‌..మరికాసేపట్లో ఖాతాల్లోకి 10 వేలు!

మార్గదర్శి సహ వ్యవస్థాపకులు జేజీ రెడ్డి వారసుల మూలధన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో వాటాల బదలాయింపు వ్యవహారంలో సీఐడీ (CID) తనపై నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ ఈనాడు అధిపతి రామోజీరావు (Ramoji Rao), చెరుకూరి శైలజ (Shailaja) ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసు హైకోర్టులో సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళింది. అయితే ఆయన తాను విచారణ చేయలేనని చెప్పడంతో వేరే బెంచ్ కు బదిలీ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు