Maoist : నేటినుంచి మావోయిస్టు వారోత్సవాలు.. ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు!

నేటినుంచి ఆగస్టు4 వరకూ మవోయిస్టుల వారోత్సవాలు జరగనున్నాయి. ఏజెన్సీ మండలాలు వాజేడు, వెంకటాపురంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

New Update
Maoist : నేటినుంచి మావోయిస్టు వారోత్సవాలు.. ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు!

Maoist Festivals : నేటినుంచి ఆగస్టు 3 వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు (Maoists) వారోత్సవాల సందర్భంగా తెలంగాణ (Telangana) లోకి వచ్చేందుకు మావో యాక్షన్ టీమ్‌ (Mao Action Team) ల ప్రయత్నాలు చేస్తున్నాయనే సమాచారంతో కౌంటర్ ప్లాన్‌తో చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు.

ఇది కూడా చదవండి: Olympics: ఒలింపిక్స్‌లో బోణి కొట్టిన భారత్‌.. షూటింగ్‌లో మనుభాకర్‌కు కాంస్యం

ఈ మేరకు మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టి.. ఏజెన్సీ మండలాలు వాజేడు, వెంకటాపురంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తాడ్వాయి పీఎస్ పరిధిలో ఆదివాసీ గూడేలను జల్లెడ పడుతున్నారు. గతంలో మావోయిస్టుల సానుభూతిపరులుగా పనిచేసిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టులకు తీవ్ర నష్టం వాటిల్లగా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న ముఖ్యనేతలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే పోలీసు అధికారులు ఆదేశాలు పంపించారు.

Advertisment
తాజా కథనాలు