ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మరో ఘాతుకం

ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉనికిని చాటుకునేందుకు ఉపసర్పంచ్‌తో సహా మరొకరిని కిడ్నాప్‌ చేసి హతమార్చినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన పోలీస్‌ యంత్రాంగం, ఆదివాసీ సంఘాలు వారిని విడిపించే ప్రయత్నం చేశాయి. 15 మందిని కిడ్నాప్ చేసి, ఇద్దరిని దారుణంగా హతమార్చారు మావోయిస్టులు.

New Update
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మరో ఘాతుకం

Maoists killed two persons

దారుణంగా హత్యలు

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. సుక్మా జిల్లా బుర్కాపాల్ గ్రామ ఉప సర్పంచ్ మడవి గంగతో పాటు 15 మందిని మావోయిస్టులు రాత్రి కిడ్నాప్ చేశారు. అనంతరం అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టును నిర్వహించారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ గంగ, టీచర్ సుక్కాను దారుణంగా హత్య చేశారు. మిగిలిన 13 మంది ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

లేఖ విడుదల

ఈ ఘటనపై సుక్మా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ను వివరణ కోరగా.. మావోయిస్టుల చెరలో ఉన్న గంగతో పాటు గ్రామస్థులను సురక్షితంగా విడిపించేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. ఈ లోపు మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఉపసర్పంచ్‌ గంగతోపాటు మరో వ్యక్తిని ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చినట్టుగా సమాచారం. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మరో వ్యక్తి అధ్యాపకుడు సుక్కా కవాసిగా తెలుస్తున్నది. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్‌ డివిజన్‌ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు.

Advertisment
తాజా కథనాలు