Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో 40 మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు. By BalaMurali Krishna 21 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి Maoists Kidnapped 40 people in Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు. పర్సేగడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుట్రూ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చీకటి రాజ్ గుట్టలపై ఆదివాసీ వనదేవతలకు పూజలు చేసేందుకు 40 మంది స్థానికులు వెళ్లారు. ఆ సమయంలో వారిని బెదిరించి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వారిని క్షేమంగా వదిలేయాలని బాధిత కుటుంబసభ్యుల వేడుకుంటున్నారు. అయితే కిడ్నాప్ చేసిన వారిలో కుట్రూ గ్రామ మాజీ సర్పంచ్ మహేష్ కుమార్ గోటా మినహా మిగతా గ్రామస్థులను వదిలిపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎందుకు కిడ్నాప్ చేశారనేది చెప్పలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఆ జిల్లాలలో భారీ వర్షాలు! #chhattisgarh #maoists #maoists-kidnapped-40-people-in-chhattisgarh #maoists-kidnapped మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి