Hidma Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతం..? మావోయిస్టు అగ్రనేత, మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా చనిపోయినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. అయితే, మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. By Shiva.K 15 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Maoist Hidma Killed In Encounter: మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్.. మావోయిస్ట్ కీలక నేత హిడ్మా హతమయ్యాడా? అంటే అవుననే అంటున్నారు భద్రతా దళాలు. మడకం హిడ్మా అలియాస్ చైతు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన పరస్పర కాల్పుల్లో హిడ్మా చనిపోయాడని ప్రకటించారు పోలీసులు. అయితే, హిడ్మా మృతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో హిడ్మా నిజంగానే చనిపోయాడా? గతంలో మాదిరిగా ఈ ప్రకటన కూడా వట్టిదేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. పోలీసులు కాల్పుల్లో హిడ్మా చనిపోయాడంటూ గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే, ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా నుంచి ప్రకటన వచ్చింది. దాంతో పోలీసులకు బిగ్ షాక్ తగిలినట్లయ్యింది. హిడ్మా మృతి నిజం అంటున్న పోలీసులు.. మావోయిస్టు దళాలు బాలాఘాట్ జిల్లా ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో తిష్ట వేసినట్లు ఎంపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన హాక్ ఫోర్స్ సిబ్బందికి పక్కా సమాచారం అందింది. ఈ మావో దళంలో హిడ్మా కూడా ఉన్నట్లు సమాచారం అందుకున్న స్పెషల్ ఫోర్స్.. ఆకస్మిక దాడికి పాల్పడింది. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో హిడ్మా చనిపోయాడంటూ మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్. మూడు రాష్ట్రాల పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన వ్యక్తి. అతనిపై మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో రూ.14 లక్షల రివార్డు ఉంది. ఇలా పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్ విసురుతున్న మడావి హిడ్మాను తాజాగా చనిపోయాడంటూ పోలీసులు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లా మిర్తుర్‌కు చెందిన హిడ్మా(40 అంచనా).. దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో ఉన్నాడు. 1996 సంవత్సరంలో తన 17 ఏళ్ల వయసులోనే హిడ్మా మావోయిస్టు పార్టీలో చేరాడు. హిడ్మా చదివింది కూడా కేవలం 7వ తరగతి మాత్రమే కావడమే విశేషం. ఇలాంటి వ్యక్తి ఏకంగా మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో పనిచేశాడు. ఆ తరువాత పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చేరాడు. అనంతరం.. మరింత యాక్టీవ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులకు, అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాడు హిడ్మా. మావోయిస్టులు పాల్పడిన అనేక విధ్వంసాలకు హిడ్మానే మూలకారణంగా చెబుతున్నారు పోలీసులు. ప్రతి విధ్వంసం వెనుక హిడ్మా ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. హిడ్మా పదికి పైగా ఆపరేషన్స్‌కి కుట్ర పన్నాడని, అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అని ప్రకటించారు పోలీసులు. Also Read: అసెంబ్లీని కూలుస్తారా? సీఎం రేవంత్ సంచలన రిప్లై..! 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. #madhya-pradesh #maoist-hidma-killed-in-encounter #maoist-hidma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి