Hidma Encounter: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఎన్కౌంటర్లో హిడ్మా హతం..?
మావోయిస్టు అగ్రనేత, మూడు రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయాడు. బాలాఘాట్ జిల్లా ఖాంకోదాదర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. అయితే, మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.