House Plants: గాలిని శుద్ధి చేసే మొక్కలు..ఇంట్లో ఉండాల్సిందే

మనం మన పెరట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటాం. అదే విధంగా ఇంట్లో కూడా ఇండోర్‌ ప్లాంట్లను పెంచుకుంటాం. అయితే.. ఇవి కేవలం అందం కోసమే పనికొస్తుంటాయి. కాని కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా మనకు అందిస్తాయి.

New Update
House Plants: గాలిని శుద్ధి చేసే మొక్కలు..ఇంట్లో ఉండాల్సిందే

సాధారణంగా మనం మన పెరట్లో ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటాం. అదే విధంగా ఇంట్లో కూడా ఇండోర్‌ ప్లాంట్లను పెంచుకుంటాం. అయితే.. ఇవి కేవలం అందం కోసమే పనికొస్తుంటాయి. ఇప్పుడు చెప్పబోయే మొక్కలను పెంచుకోవడం వల్ల ఇంటికి అందంతో పాటు స్వచ్ఛమైన గాలిని కూడా మనకు అందిస్తాయి. అయితే.. ముఖ్యంగా దీపావ‌ళి స‌మ‌యంలో ఈ మొక్కల‌ను మ‌నం ఇంట్లో తప్పకుండా పెంచుకోవాలి. ఎందుకంటే ఆ పండుగ సమయంలో బయటి గాలితో పాటు ఇంట్లో గాలి కూడా బాగా కలుషితంగా మారుతుంది. ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల ఆక్సిజన్‌ బాగా పెరగడంతో పాటు గాలి కాలుష్యం తగ్గుతుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన అందమైన, ఆరోగ్యకరమైన మొక్కలు ఏంటంటే.. కలబంద దీనిని ఎండ తగిలే చోట ఉంచాలి. ఈ కలబంద మొక్క గాలిని సమర్థవంతంగా శుభ్రం చేయడంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ కలబంద గాలి నుంచి బెంజిన్, ఫార్మాల్డిహైడ్‌ను తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ మొక్కను మనం ఇంట్లోనే సులభంగా పెంచుకునేలా ఉంటుంది. ఎక్కువ ప్రయోజనాలు ఉన్న మొక్కల్లో స్నేక్‌ ప్లాంట్‌ ఒకటి.

ఇంట్లో పెంచుకోవ‌డం వ‌లన ఎంతో మేలు

ఇది దాదాపు 107 కాలుష్య కార‌కాల‌ను గాలిలోంచి తొలగిస్తుంది. అంతేకాకుండా అధిక సంఖ్యలో ఆక్సిజ‌న్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మనం సులభంగా ఇంట్లో పెంచుకోవచ్చు. మరోటి ర‌బ్బర్ మొక్కను ఇంట్లో పెంచుకోవ‌డం వ‌లన మనకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. దీనికి ఎక్కువగా నీరు అవసరం అవుతుంది. ద్రవరూపంలో ఉండే ఎరువులను వాడాల్సి ఉంటుంది. హానిక‌ర‌మైన కాలుష్య కార‌కాల‌ను తీసుకుని, విష వాయువుల పనిపట్టడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆక్సిజన్‌ను కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.

వీటిని పెంచుకుంటే ఇంటికి అందంతో పాటు ఆరోగ్యం

ఇంట్లో పెంచుకోవ‌డానికి పనికివచ్చే మొక్కల్లో పీస్ లిల్లీ ఒక‌టి. ఇది సున్నిత‌మైన మొక్క. ఈ మొక్క చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. దీని పూలు వివిధ రంగులను కలిగి ఉంటాయి. గాల్లో ఉండే ఫార్మాల్డిహైడ్, కార్బన్‌మోనాక్సైడ్‌ వాయువులను ఇది గ్రహిస్తుంది. కిచెన్‌, వాష్‌రూమ్‌ల దగ్గర ఈ మొక్కను ఉంచాలి. అలాగే ఆర్కిడ్ మొక్కల‌ను కూడా మ‌నం ఇంట్లో పెంచుకోవ‌చ్చు. ఎండ ఎక్కువ‌గా ఉండేచోట వీటిని ఉంచాలి. గోడ‌ల‌కు వేసే పెయింట్‌లోని జీలిన్‌ను తొలగించడంలో ఈ మొక్కలు ఉపయోగపడతాయి. వీటి పూలు చక్కగా ఉంటాయి. వీటిని పెంచుకుంటే ఇంటికి అందంతో పాటు మనకు ఆరోగ్యం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: మహిళలు స్మోకింగ్‌ చేస్తే ఏమౌతుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు