South Central Railway: హైదరాబాద్ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దు!

సికింద్రాబాద్, హైదరాబాద్‌ రైల్వే డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల వల్ల నెల రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌-వరంగల్, సిర్పూర్‌ టౌన్‌- కరీంనగర్‌, నడికుడి-కాచిగూడ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

South Central Railway: సికింద్రాబాద్, హైదరాబాద్‌ రైల్వే డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌-వరంగల్, వరంగల్-హైదరాబాద్‌ , కాజీపేట-బల్లర్ష రైళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 30 వరకు రద్దయ్యాయి.

బల్లర్ష-కాజీపేట రైలు సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్ 1 వరకు , సిర్పూర్‌ టౌన్‌- కరీంనగర్‌, కరీంనగర్‌ -బోధన్‌ రైళ్లు సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు, బోధన్‌-కరీంనగర్‌ సెప్టెంబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 1 వరకు ..కాచిగూడ-నడికుడి, నడికుడి-కాచిగూడ రైళ్లు సెప్టెంబర్‌ 1-30 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌ మంగళవారం తెలిఆరు.

హెచ్‌ఎస్ నాందేడ్‌-రాయచూరు రైలు సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు, తాండూరు-రాయచూరు మధ్య పాక్షికంగా రద్దయ్యింది. అదే విధంగా భద్రాచలం రోడ్‌- బల్లర్ష, సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రైళ్లకు సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు కాజీపేట లో స్టాప్ ని తొలగించారు.

Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం!

Advertisment
తాజా కథనాలు